జిమ్ ఫిట్: మెగా కోడలు వర్సెస్ సానియా

0

జిమ్ కి వెళ్లి కండలు పెంచడం.. 6 ప్యాక్ యాబ్స్ కోసం శ్రమించడం.. బైసెప్ ట్రైసెప్ వగైరా మెయింటెయిన్ చేయడం ఇన్నాళ్లు కేవలం బోయ్స్ మాత్రమే చేసే పని. ఇటీవల మగువలు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఫిట్ నెస్ పై అవగాహన ఉన్న సెలబ్రిటీలు అసలే ఎందులోనూ తగ్గడం లేదు. అటు బాలీవుడ్ కి వెళితే జాన్వీ-సారా అలీఖాన్ లాంటి డెబ్యూ నాయికలు.. మలైకా-శిల్పా శెట్టి లాంటి సీనియర్ భామలు జిమ్ముల్లో నిరంతరం కసరత్తులు చేస్తూ పెర్ఫెక్ట్ ఫిట్ బాడీలతో అదరగొట్టేస్తున్నారు.

ఆ హుషారు ఉత్తరాది సెలబ్రిటీలకేనా.. ఇక్కడ సౌత్ సెలబ్రిటీలకు చేతకాదా? అంటే.. ఇక్కడా ఎందులోనూ తగ్గేది లేదనే నిరూపిస్తున్నారు. ముఖ్యంగా మెగా కోడలు ఉపాసన జిమ్-ఫిట్ నెస్ విషయంలో ఎంతో ఇదిగా స్ఫూర్తిని నింపుతున్నారు. నిరంతరం జిమ్ యోగా చేయడమే గాక ఆరోగ్యం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటో నవతరానికి వీడియో క్లాసెస్ ద్వారా టీచ్ చేస్తున్నారు. ఇక ఉపాసన హైదరాబాద్ లోని సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ల సమక్షంలో జిమ్ చేస్తున్నప్పటి ఫోటోలు వీడియోలు ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేవలం ఆరు నెలల నుంచి ఏడాదిలోగానే పూర్తిగా మారిన రూపంతో అభిమానులకు షాకిచ్చిన ఉపాసన నిరంతర ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఏదో ఒక కొత్త సంగతిని పరిచయం చేస్తున్నారు.

పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి … టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసే జిమ్ చేస్తుంటారు. ఒకే ఫిట్ నెస్ కోచ్ వద్ద శిక్షణ పొందారు. వీలున్న ప్రతిసారీ ఉపాసనతో కలిసి జిమ్ చేస్తున్న ఫోటోల్ని రివీల్ చేస్తూనే ఉన్నారు ఉపాసన. నేడు సానియా బర్త్ డే సందర్భంగా తనతో కలిసి కసరత్తులు చేస్తున్న ఓ ఫోటోని ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ‘మై ఫిట్ నెస్ ఇన్ స్పిరేషన్..సానియా“ అంటూ కసరత్తులు చేసే ఈమోజీని జోడించారు. తన లిమిట్స్ కి తగ్గట్టే జిమ్మింగులో సాయం చేసినందుకు సానియాకు థాంక్స్ చెప్పారు. ‘ఈరోజు నిన్ను మిస్సవుతున్నా.. మరో రోజు జిమ్ లో కలుసుకుందా! ‘అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఉపాసన తన ఫిట్ నెస్ స్ఫూర్తి గైడ్ రామ్ చరణ్ మాత్రమే అని అభిమానులు భావిస్తుంటే ఇప్పుడిలా మరో కొత్త పేరు రివీలైందన్నమాట.
Please Read Disclaimer