టాలీవుడ్ కి స్టైలిష్ విలన్ దొరికాడే

0

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ విలన్స్ కొరత ఉంది. హీరోని డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ తో ఎవరూ హైలైట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే కొందరు నటులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కి ఓ స్టైలిష్ విలన్ దొరికాడు. అవును ‘అశ్వత్థామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం అయ్యాడు బెంగాలి నటుడు జిషు సేన్ గుప్తా. మొదటి సినిమాకే తన విలనిజంతో మెప్పించాడు. కొత్త దర్శకుడి ఈ మేరకూ రాబట్ట గలిగాడంటే ఇంకా స్టార్ డైరెక్టర్ చేతిలో పడితే అతని రేంజ్ మరోలా ఉంటుంది.

నిజానికి కథ పరంగా విలన్ ని ఎక్కడా పరిచయం చేయకుండా అతని పేరు కూడా బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కానీ రిలీజ్ తర్వాత శౌర్య కంటే అతని గురించే అందరూ మాట్లాడుకునే పరిస్థితి. సినిమాలో అతని క్యారెక్టర్ చూసి అందరికీ ధృవ లో అరవింద్ స్వామి గుర్తొచ్చాడు. అంత స్టైలిష్ గా ఆ క్యారెక్టర్ ను చేసాడు జిషు. ఇప్పటికే బెంగాలి – హిందీ లో 98 సినిమాలు చేసిన అనుభవంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసాడు.

సినిమా చూసిన వారెవరైనా తెలుగులో ఈ టైప్ విలన్ క్యారెక్టర్స్ కి ఇకపై అతన్నే కాంటాక్ట్ చేసుకొనే పరిస్థితి. మరి ఈ స్టైలిష్ విలన్ తెలుగులో కూడా బిజీ అవుతాడా అతనికి మన వాళ్ళు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తారా ? చూడాలి.