జోడి – టీజర్ టాక్

0

సక్సెస్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న ఆది సాయికుమార్ ఇటీవలే బుర్రకథతో మరో డిజాస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. దాన్ని వీలైనంత త్వరగా మరిచిపోయెందుకు అనేలా కొత్త సినిమాతో వస్తున్నాడు. అదే జోడి. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ ఇందాకా విడుదల చేశారు. ఓ అబ్బాయి అమ్మాయి మధ్య పరిచయం ప్రేమగా ఎలా మారిందన్న సింపుల్ థీమ్ ని లైట్ కామెడీతో టచ్ చేస్తూనే చక్కని కెమిస్ట్రీని ఇద్దరి మధ్య పండించడం ద్వారా ఆకట్టుకునేలా చేశారు.

కథలో కీలకమైన ట్విస్టు కానీ ఇంకేదైనా స్పెషల్ కానీ ఇందులో ఏదీ రివీల్ చేయలేదు.లవ్ ని ఎక్స్ ప్రెస్ చేస్తూ ఇద్దరు లోతుగా ప్రేమలో మునిగిపోవడాన్ని మాత్రమే హై లైట్ చేశారు. చెప్పుకునే ప్రత్యేకత ఏమి లేకపోయినా టీజర్ లో ఫ్రెష్ నెస్ ఉంది. లీడ్ పెయిర్ మధ్య సున్నితమైన సన్నివేశాలను చక్కని టైమింగ్ ద్వారా దర్శకుడు విశ్వనాధ్ ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది.

ఆది లుక్స్ తో ఆకట్టుకోగా అతని కన్నా ఎక్కువగా శ్రద్ధా శ్రీనాథ్ హావభావాలతో డామినేట్ చేసింది. వీళ్ళు కాకుండా కమెడియన్ సత్య తప్ప ఇంకెవరిని చూపించలేదు. ఫణి కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థీమ్ కి తగ్గట్టు చాలా కూల్ గా క్యాచీగా ఉంది. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం అందించిన జోడితో విశ్వనాథ్ ఎలా మెప్పించబోతున్నాడో విడుదలయ్యాకే తెలుస్తుంది.
Please Read Disclaimer