జోడి – ట్రైలర్ టాక్

0

ఇటీవలే బుర్రకథతో పలకరించిన ఆది సాయి కుమార్ కొత్త సినిమా జోడి. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్. దీని ట్రైలర్ ఇందాకా విడుదలైంది. కథ విషయానికి వస్తే అనగనగా బుద్ధిమంతుడైన ఓ అబ్బాయి(ఆది సాయికుమార్). తండ్రి(సీనియర్ నరేష్) కి విపరీతమైన క్రికెట్ బెట్టింగ్ పిచ్చి. ఉద్యోగం చేసుకుంటున్న ఆ అబ్బాయికి కాంచనమాల(శ్రద్ధ శ్రీనాథ్)అనే అమ్మాయి తొలిచూపులోనే నచ్చేసి ప్రేమిస్తాడు.

అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో నాన్న బెట్టింగ్ వ్యామోహం వల్ల ఆ అబ్బాయి కుటుంబంతో పాటు ప్రేమ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. కోరుకున్న అమ్మాయి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడీ వలయం నుంచి తండ్రిని బయటికి తీసుకొచ్చి తమ జోడిని ఎలా ఆ యువకుడు గెలిపించుకున్నాడు అనేదే ఇందులోని కథగా కనిపిస్తోంది.

ఆర్టిస్టులందరూ మంచి ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్ళు కావడంతో రిచ్ నెస్ వచ్చింది. ఆది సాయికుమార్ శ్రద్ధ శ్రీనాథ్ లు టైటిల్ కు తగ్గట్టు మంచి జోడి అనిపించారు. యాక్టింగ్ లోనూ సహజత్వంతో ఆసక్తి రేపారు. సీనియర్ నరేష్ – సితార – సిజ్జు ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ పార్ట్ ని వెన్నెల కిషోర్ – సత్య తీసుకున్నారు.

చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు కీలక పాత్ర చేయడం విశేషం. ఫణి కళ్యాణ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంలో ఫ్రేమ్స్ బాగా కుదిరాయి. విశ్వనాథ్ అరిగెల తీసుకున్న పాయింట్ లో మరీ కొత్తదనం లేకపోయినప్పటికీ టేకింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్ అయినట్టుగా తోస్తోంది. వచ్చే నెల 6న విడుదల కానున్న జోడికి ట్రైలర్ ప్లస్ గా నిలుస్తోంది
Please Read Disclaimer