ఇలియానా సడెన్ సర్ ప్రైజ్..

0

సడెన్ సర్ ప్రైజ్ లు ఇవ్వడం ఇలియానాకు కొత్తేమీ కాదు. ఏడెమినిదేళ్ల పాటు ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం సాగించి వన్ ఫైన్ డే.. మా మధ్య అదేమీ లేదని తేలిగ్గానే చెప్పేసింది. ప్రేమ అంత డీప్ గా ఏమీ లేదు! అంటూ ముక్తాయించి అభిమానులకు షాకిచ్చింది. కాఫీలు.. డిన్నర్ల వరకూ ఒక స్నేహితుడు కావాలనుకున్నానని చెప్పి ఇలా కూడా చేస్తారా? అని సందేహించేలా చేసింది.

అదంతా సరే కానీ.. ప్రస్తుతం ఒంటరి స్టాటస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఇలియానా ఇటీవల కెరీర్ పై పూర్తిగా శ్రద్ధ సారించింది. ఓవైపు రిలీజ్ కి వస్తున్న భారీ మల్టీస్టారర్ `పాగల్ పంతి` సినిమాని ప్రమోట్ చేసుకుంటూనే ఇరుగు పొరుగు భాషల్లో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఒక రకంగా దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతోంది.

అయితే ఇల్లీ ఇంత చేసినా అది కాస్తా బెడిసి కొడుతోందే కానీ సరైన రిజల్ట్ మాత్రం దక్కలేదు. అందుకే ఇప్పటికైతే కొత్త ప్రాజెక్టుల మ్యాటర్ మాట్లాడడం లేదు. పూర్తిగా ఈనెల 22న రిలీజ్ కి వస్తున్న పాగల్ పంతి పైనే దృష్టంతా సారిస్తోంది. ఇదిగో ఇలా జాన్ అబ్రహాంతో కలిసి తన సినిమాని ప్రమోట్ చేస్తోంది. ఈ సినిమా తన కెరీర్ వెరీ స్పెషల్ అని చెబుతోంది. అనీల్ కపూర్- జాన్ అబ్రహాం- అర్షద్ వార్షీ- పులకిత్ సమ్రాట్- క్రితి కర్భందా- ఊర్వశి రౌతేలా తదితరులు ఈ చిత్రంలో నటించారు. వీళ్లందరిలోకి ఇలియానా ప్రచారార్భాటంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ముంబై ప్రమోషన్స్ లో ఇలా చారల గుర్రంలా ప్రత్యక్షమైంది. ఆ చారల డిజైన్ కి తగ్గట్టే అదిరిపోయే ఎక్స్ పోజింగ్ తో అందరి కళ్లు తనవైపే తిప్పేసుకుంది మరి!!
Please Read Disclaimer