ప్రభాస్ సినిమాతో పోటీ.. జాన్ రియాక్షన్ ఇదే

0

ఈ ఆగష్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు ఇప్పటికే బైటకు వచ్చింది.  ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’..  అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’.. జాన్ అబ్రహాం హీరోగా నటించిన ‘బాట్లా హౌస్’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకదానితో మరొకటి పోటీ పడనున్నాయి.  ఈ పోటీ గురించి ఇప్పటికే ఇటు మెయిన్ స్ట్రీమ్  మీడియాలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

మూడిట్లో క్రేజ్ పరంగా ప్రభాస్ ‘సాహో’ దే పైచేయి అయినప్పటికీ అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ కు కూడా పెద్ద సినిమానే.  ఈమధ్య అక్షయ్ నటించిన సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.  ఈసారి కూడా ఈ చిత్రం కంటెంట్ పై మంచి అంచనాలే ఉన్నాయి.  అయితే ‘సాహో’.. ‘మిషన్ మంగళ్’ తో పోలిస్తే జాన్ అబ్రహమ్ సినిమా రేంజ్ చాలా తక్కువ.  జాన్ కు పెద్దగా మార్కెట్ లేదు.  మరి ఈ రెండు భారీ సినిమాలతో తన చిత్రాన్ని పోటీకి ఎందుకు నిలిపాడు?

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్ అబ్రహం అదే విషయాన్ని వెల్లడించాడు.  ఆగష్టు 15 న రిలీజ్ చేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని.. ఇది తమ సినిమాపై తమకున్న కాన్ఫిడెన్స్ అని తెలిపాడు.  ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నామనే నమ్మకం తమకుందని అన్నాడు.  అంతే కాకుండా ప్రేక్షకులకు సినిమాల చూసే విషయంలో ఛాయిస్ కూడా ఉంటుందని తెలిపాడు. అంతా బాగానే ఉంది కానీ ‘సాహో’ కు కనుక సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం జాన్ సినిమాకు ఇబ్బంది తప్పకపోవచ్చు.  

2008 లో ముంబైలో జరిగిన ‘ఆపరేషన్ బాట్లా హౌస్’ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు నిఖిల్ అద్వాని తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో జాన్ అబ్రహం సంజీవ్ కుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.  
Please Read Disclaimer