కొత్త ట్విస్టు: సైరా – వార్ లకు జోకర్ చెక్

0

ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రభంజనం.. మరోవైపు ఉత్తరాదిన వార్ ప్రభంజనం.. ఈ రెండిటి గురించి ట్రేడ్ ఆసక్తిగా ముచ్చటిస్తోంది. అయితే ఆ రెండిటి మధ్యా ఊహించని చిచ్చు పెడుతోంది జోకర్ మూవీ. రిలీజ్ ముందు ఏమాత్రం హైప్ లేని ఈ హాలీవుడ్ సినిమా మల్టీప్లెక్స్ ఆడియెన్ కి పిచ్చిగా నచ్చేయడంతో అక్కడ సైరా.. వార్ చిత్రాల కలెక్షన్స్ కి చిల్లు పెట్టేస్తోందట.

ముఖ్యంగా ఈ దసరా సెలవుల్లో మల్టీప్లెక్సుల నుంచి భారీగా వసూళ్లు కొల్లగొట్టాలని ఆశించిన సైరా.. వార్ చిత్రాల మేకర్స్ కి ఇది ఊహించని పంచ్ అని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాల మధ్య బిగ్ వార్ నడుస్తోంది. టాలీవుడ్ నుంచి సైరా నరసింహారెడ్డి నుంచి వార్.. హాలీవుడ్ జోకర్ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైరా ఇప్పటికే వసూళ్లతో దుమ్ము దులిపేస్తోంది. మూడు రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ చెబుతోంది. అయితే మల్టీప్లెక్స్ ల్లో మాత్రం వార్.. సైరాలతో జోకర్ పోటీ పడుతోంది. ఓవరాల్ కలెక్షన్స్ పరంగా వార్ చిత్రంపై `సైరా`దే అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. `సైరా` మెగాస్టార్ సినిమా కావడంతో ఏపీ-నైజాంలో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతోంది. వార్ కి మాత్రం ఉత్తరాదిన బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో నూ అడుగు పెట్టింది. హృతిక్-టైగర్ ఒకిరితో ఒకరు పోటీపడి నటించారన్న పేరొచ్చింది.

అయితే ఈరెండు సినిమాలకు విదేశీ సినిమా జోకర్ మల్టీప్లెక్సుల్లో చెక్ పెట్టేయడం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ సినిమా ప్రభావం ఈ రెండు సినిమాలపై ఏం ఉంటుందిలే అనకుంటే తప్పులో కలేసినట్టేనని ప్రూవ్ అవుతోంది. ఈ రెండు సినిమాల వసూళ్ల పై మెట్రో నగరాల్లో జోకర్ పెద్ద దెబ్బ కొడుతోంది. సినిమాకు హిట్టు టాక్ రావడంతో భారత్ లో జోకర్ కు అదరణ అంతకంతకు పెరుగుతోందట. జోకర్ చిత్రం దేశంలోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్ కాకపోయినా రిలీజ్ అయిన ప్రతీ చోటా సత్తా చాటుతోంది. భారత్ లో 700 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇదేమీ ఆషామాషీ రిలీజ్ కానేకాదు. సినిమా రిలీజ్ హక్కులు 16 కోట్లకు అమ్ముడవ్వగా… మూడు రోజుల్లోనే 20 కోట్లు కొల్లగొట్టింది. అంటే ఓ హాలీవుడ్ సినిమాకు భారతీయులు ఎంత పెద్ద పీట వేస్తారో దీనిని బట్టి అర్ధమవుతోంది. ఇక చెన్నయ్ బాక్సాఫీస్ వద్ద సైరా చిత్రం రెండో రోజు 14లక్షలు వసూలు చేస్తే.. జోకర్ చిత్రం ఏకంగా 19లక్షలు వసూలు చేసిందట. దీనిని బట్టి మెట్రోల్లో జోకర్ ప్రభావం అర్థం చేసుకోవచ్చు.
Please Read Disclaimer