నిత్యా కూడా కీర్తిలా చేస్తే కష్టం!

0

దశాబ్ధం కెరీర్ కి చేరువలో ఉంది నిత్యా మీనన్. అక్షయ్ `మిషన్ మంగళ్` సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. కెరీర్ లో వరుసగా వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటూ ఇరుగు పొరుగునా టాప్ స్టార్ గా హవా సాగిస్తోంది. ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలోనూ నటిస్తోంది. దీంతో పాటు నిత్య తదుపరిది రెండు మలయాళ చిత్రాల్లో నటించనుంది. కోలంబి సహా.. కుంచాకో బోబన్ తో ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది. ట్యాలెంటెడ్ మిస్కిన్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తోంది.

అంతేకాదు.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి అటువైపు ఈ అమ్మడు దృష్టి సారించినట్టే కనిపిస్తోంది. తాజాగా నిత్యామీనన్ `బ్రీత్ సీజన్ 2`లో నటించింది. అమెజాన్ ప్రైమ్ లో ఇది అన్ని సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

అయితే ఈ సీజన్ యూనిక్ నెస్ ఏమిటి? అంటే ఏమీ కనిపించడం లేదు. ఇది కూడా కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` తరహా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిందని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది. బ్రీత్ తొలి సీజన్ సక్సెసైంది. సీజన్ 2 టీజర్ చూస్తుంటే పెంగ్విన్ తో పోలిక ఇబ్బందికరమే. ఇక అక్కడా ఇక్కడా కూతురు మిస్సింగ్ అన్న కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆడియెన్ పోల్చి చూసుకునేందుకే ఆస్కారం ఎక్కువ. అది వెబ్ సిరీస్ లకు ఏమంత మంచిది కాదు. మరి కీర్తిలానే నిత్యా మ్యాజిక్ చేస్తుందా? ఇందులో ఇంకేదైనా కొత్తగా ఉంటుందా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.
Please Read Disclaimer