తారక్ గుట్టు మాత్రం బయట పడలేదే!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అన్న కళ్యాణ్ రామ్ అంటే ఎంతటి అభిమానమో తెలిసిందే. అన్న కోసం ప్రతిసారీ ప్రీరిలీజ్ వేడుకలకు తారక్ విచ్చేసి కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన `ఎంత మంచివాడవురా` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ ముఖ్య అతిథి గా విచ్చేసిన సంగతి తెలిసిందే. నందమూరి ఈవెంట్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇదే వేదికపై అన్నయ్య కళ్యాణ్ రామ్ గురించి తారక్ గొప్పగా మాట్లాడాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో అన్నను చూడాలనుకున్న కల ఈ సినిమాతో తీరిపోతుందని సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ఇంకా చిత్ర దర్శక నిర్మాతలు .. మిగతా నటీనటుల గురించి తనదైన శైలిలో స్పందించాడు. అయితే ఇదే వేదికపై ఆర్.ఆర్.ఆర్ గురించి ఏదైనా చెబుతాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.

కానీ ఒక్క ముక్క కూడా చెప్పలేదు.. కదా కనీసం ఆర్.ఆర్.ఆర్ టాపిక్ కూడా వేదికపై రాకుండా జాగ్రత్త పడ్డాడు. అంతేకాదు తన లుక్ సంగతిని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతడు క్యాప్ తో కవర్ చేసేశాడు. తన లుక్ కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో తారక్ ఓపెన్ అయ్యేందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వనేలేదు. తారక్ బాల్డ్ హెడ్ తో కనిపించనున్నాడన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అతడి ప్రవర్తన సందేహాలకు తావిచ్చింది. అందుకే తారక్ ప్రత్యేకంగా క్యాప్ పెట్టుకుని రావడం మరో సారి అంతటా చర్చాంశనీయంగా మారింది.

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ విషయం లో మరో నటుడు రామ్ చరణ్ లు కొంత రివీలై పోయినా.. తారక్ మాత్రం ఎస్కేప్ అవ్వడానికి చూస్తుండడం ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఆ లుక్ విషయమై దాచేసేంత రహస్యం ఏం ఉంది? అన్న చర్చా వేడెక్కిస్తోంది. అసలు ఆ రహస్యం ఏమిటి అన్నది జక్కన్నకు..తారక్ మాత్రమే తెలియాలి. న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ పై ఫ్యాన్స్ లో ఎలాంటి విమర్శలొచ్చాయో తెలిసిందే. పాత పోస్టర్ కే కొత్త రంగులేసి పండగ చేస్కోమన్న జక్కన్నపై ఫ్యాన్స్ ఫైరయ్యారు. నిన్నటి సీన్ వల్లనా మరోసారి అభిమానులకు నిరాశ తప్పలేదు.
Please Read Disclaimer