బాబోయ్.. తారక్ అంత రిస్క్ చేశాడా?

0

రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఏ హీరో అయినా ప్రాణం పెట్టి పని చేస్తాడు. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో ఎంతటి సాహసంను అయినా చేసేందుకు సిద్ద పడతారు. చత్రపతి సినిమా నుండి కూడా రాజమౌళి తన హీరోల్లోని హీరోయిజంను ఏ స్థాయిలో చూపిస్తాడో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోల ఇంట్రడక్షన్ కు రాజమౌళి ఎంచుకునే మార్గం అద్బుతం అన్నట్లుగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న జక్కన్న ఇద్దరు హీరోలకు అద్బుతమైన ఇంట్రడక్షన్ సీన్స్ ను పెట్టినట్లుగా తెలుస్తోంది.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ గురించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు కాని ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పులితో ఫైట్ ఉంటుందని అంటున్నారు. పులితో ఫైట్ సీన్ కోసం ఎక్కువ సహజమైన షాట్స్ ను జక్కన్న ఉపయోగించబోతున్నాడట. అందుకోసం ఏకంగా రియల్ పులితోనే ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నాడట.

పులితో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా కష్టపడ్డట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆమద్య పులితో పోరాటానికి సంబంధించిన కొన్ని షాట్స్ లీక్ అయ్యాయి. ఆవి కేవలం మచ్చుకు మాత్రమే. అసలు సినిమా బాకీ ఉందంటా. ఎన్టీఆర్ ఇన్ని చిత్రాల్లో ఎప్పుడు లేని విధంగా ఇంట్రడక్షన్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం తన లుక్ ను మార్చుకోవడంతో పాటు… ప్రముఖ ట్రైనర్ సమక్షంలో ఫిజికల్ గా చాలా మార్పు వచ్చాడట. మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా కష్ట పడటంతో పాటు పులితోనే రిస్క్ చేశాడట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-