యంగ్ టైగర్.. అవి కొమరం భీమ్ కాళ్ళు!

0

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ ఇప్పుడు ఇండియాలో సెట్స్ మీద ఉన్న కేజ్రీ ప్రాజెక్టులలో ఒకటి. మరి ఆ రేంజ్ లో క్రేజ్.. అంచనాలు ఉన్న ప్రాజెక్టు కోసం ‘RRR’ బృందం పడే కష్టం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కదా. రాజమౌళి.. ఎన్టీఆర్.. చరణ్ తో సహా అందరూ కష్టపడక తప్పదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంగతి తీసుకుంటే.. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర కోసం తన శరీరాకృతిని ఎలా మలుచుకుంటున్నాడో తెలిస్తే ఎవరైనా షేక్ అవడం ఖాయం.

పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ చాలాకాలంగా కసరత్తులు చేస్తున్నాడు. లాయిడ్ గతంలో కూడా ఎన్టీఆర్ కు ఆయన పర్సనల్ ట్రైలర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా లాయిడ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లెగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్నాడు. ఫేస్ కనిపించకుండా ఈ ఫోటోను తీయడం జరిగింది. ఆ లెగ్ మజిల్స్ చూస్తే ఫుట్ బాల్ ప్లేయర్స్ లెగ్స్ లాగా ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా జిమ్ లో జాయిన్ అయి.. కనీసం నెల రోజులు ట్రైనర్ చెప్పిన వారికి లెగ్ ఎక్సర్ సైజులు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అన్నిటికంటే టఫ్ డే.. లెగ్ ఎక్సర్ సైజులు చేసే రోజు. సాధారణంగా సన్నగా ఉండే ఎన్టీఆర్ కాళ్ళు ఇలా మారాయంటే.. ఎన్టీఆర్ చేత లాయిడ్ స్టీవెన్స్ ఎంత కఠినమైన ఎక్సర్ సైజులు చేయించి ఉంటాడో మనకు అర్థం అవుతుంది. అవన్నీ మన యంగ్ టైగర్ సిన్సియారిటీతో చేసి ఉంటాడు.. లేకపోతే కాళ్ళు అలా మారవు.

అందుకే ఈ ఫోటోకు లాయిడ్ స్టీవెన్స్ ఇచ్చిన క్యాప్షన్ “ఎంతో కష్టపడి ఇది సాధించాం. #కొమరం భీమ్ #RRR”. ‘లెగ్ డే ని స్కిప్ చేయము’ అని.. ఎన్టీఆర్.. రాజమౌళి పేర్లను కూడా టాగ్ చేశాడు. ఈ ఫోటో ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చింది. ఇప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైకులతో షేర్లతో హోరెత్తిస్తున్నారు.
Please Read Disclaimer