దూసుకెళుతున్న యంగ్ టైగర్ అల్టిమేట్ లుక్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖ-అరకు పరిసరాల్లో అడవుల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు జక్కన్న. తారక్ వైజాగ్ విమానాశ్రయంలో డ్రమటికల్ ఎంట్రీ ఇవ్వడం అటుపై ఆ ఫోటోలు కాస్తా లీకివ్వడం తెలిసిందే. తారక్ మునుపటితో పోలిస్తే లుక్ వైజ్ చాలా మారాడని ఆ ఫోటోలు చూశాకే అర్థమైంది. ఇప్పటివరకూ ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి తారక్ పూర్తి రూపం ఎలా ఉంటుందో ఊహించడమే కానీ ఎవరూ చూడలేదు. దాంతో యంగ్ యమ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అంటూ ఊహిస్తూ అభిమానులే కొన్ని పోస్టర్లు తయారు చేసి వదిలేస్తున్నారు. అవి కాస్తా అంతర్జాలంలో వైరల్ అయిపోతున్నాయి.

ఇక ఆర్.ఆర్.ఆర్ కోసం తారక్ తన లుక్ లో ఎంతో వేరియేషన్ ని తెచ్చాడు. ప్రఖ్యాత ఫిట్ నెస్ కోచ్ లాయిడ్ సమక్షంలో వర్కవుట్లు చేసి ఆకృతి పరంగా టోన్ డౌన్ అయ్యాడు. తారక్ పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో మైమరిపిస్తున్నాడు. తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ఆ విషయాన్ని క్లియర్ కట్ గా రివీల్ చేస్తోంది. ఇది ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పోస్టర్. ఇందులో తారక్ బ్లాక్ జాకెట్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదర గొట్టాడు. రెడ్ నెక్ పై బ్లాక్ లెదర్ కోట్.. కాంబినేషన్ సింథటిక్ లుక్ జీన్స్.. స్టైలిష్ హెయిర్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

ఆర్.ఆర్.ఆర్ కోసం అతడి హెయిర్ స్టైల్ సహా లుక్ ని పూర్తిగా మార్చాడు. ఆ లుక్ ఈ ప్రకటనకు ప్లస్ అయ్యిందనే భావించాలి. ఇకపోతే తారక్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో గుండు(బాల్డ్) తో కనిపిస్తాడని ఓ లీక్డ్ సమాచారం వేడెక్కించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా తారక్ ఇలా వాణిజ్య ప్రకటనలో కనిపించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇక జక్కన్న రివీల్ చేయనున్న లుక్ ఎలా ఉండబోతోంది? అన్న సస్పెన్స్ అభిమానుల్లో అలానే కొనసాగుతోంది.
Please Read Disclaimer