యంగ్ టైగర్ కొత్త సినిమా లాక్ చేశాడా ?

0

ప్రస్తుతం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఆర్ఆర్ఆర్ లోకంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా ఏవో కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతున్నప్పటికీ రాజమౌళి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇచ్చిన ప్రకటనలో మరోసారి కన్ఫర్మ్ అయ్యింది కూడా. దీని తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఎవరితో చేస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు త్రివిక్రమ్ మరోసారి తారక్ తో టై అప్ అవుతాడట. హారికా అండ్ హాసిని బ్యానర్ తో పాటు కళ్యాణ్ రామ్ స్వంత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యంలో ఇది రూపొందించేందుకు రంగం సిద్ధం చేసినట్టు టాక్. డిసెంబర్ కు త్రివిక్రమ్ పూర్తిగా ఫ్రీ అవుతాడు. ప్రమోషన్ కోసం ఇంకో నెల అదనంగా అనుకున్న అల్లు అర్జున్ క్యాంప్ నుంచి బయటికి వచ్చేసి కొత్త సినిమా స్టార్ట్ చేసుకోవచ్చు జూనియర్ సైతం ఎంత షెడ్యూల్స్ మారినా మహా అయితే జనవరికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుంటాడు. అటుపై త్రివిక్రమ్ తో జాయిన్ అయ్యేలా మాట్లాడుకున్నట్టు సమాచారం.

వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ తర్వాత కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్-తారక్ కాంబోలో మైత్రి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంది. కానీ కెజిఎఫ్ 2 అంత వేగంగా పూర్తయ్యే సూచనలు లేవు. వచ్చే సమ్మర్ దాకా తనను పలకరించవద్దని ప్రశాంత్ నీల్ చెప్పేశాడట. సో త్రివిక్రమ్ దగ్గర లైన్ రెడీగా ఉంది కాబట్టి ఇదే ముందు ప్రొసీడ్ అవుతారని వినికిడి. అరవింద సమేత వీర రాఘవతో మంచి కమర్షియల్ సక్సెస్ తారక్ కు ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి అంతకు మించి అనేలా ఏదో చేస్తాడనే నమ్మకం అభిమానులు పెట్టుకోవడం సహజం. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది
Please Read Disclaimer