తారక్ పవర్ ఫుల్ టైటిల్ మిస్సయ్యాడే

0

కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ సినిమా మీద బజ్ తీసుకురావడానికి బిజినెస్ కి చాలా హెల్ప్ అవుతాయి. అలాంటి పవర్ ఫుల్ టైటిల్ నే లేటెస్ట్ గా బాలయ్య సినిమాకు పెట్టారు. సౌండింగ్ లోనే పవర్ ఫుల్ అనిపించే ఆ టైటిలే ‘రూలర్’. నిజానికి ఇది ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ సినిమాలో ఓ పాటలో వచ్చే పదం. అయితే ఆ పదం వల్ల సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది.

రాజమౌళి కి కూడా ఆ సాంగ్ అంటే ఇష్టమని అప్పట్లో వెల్లడించాడు కూడా. అయితే అప్పుడి నుండి ఎన్టీఆర్ సినిమా ఏది సెట్స్ పై ఉన్నా ఫ్యాన్స్ ఈ టైటిల్ తోనే ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ వేసుకొని సంబరపడిపోయే వారు. ఒక టైంలో ‘రూలర్’ అంటే తారక్ మాత్రమే కనిపించేవాడు. అందుకే ఓ సంస్థ అప్పట్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించింది కూడా.

అయితే అబ్బాయి టైటిల్ ను లేటెస్ట్ సినిమాకు పెట్టేసుకున్నాడు బాలయ్య. ఈ టైటిల్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారో కానీ ఎట్టకేలకు అబ్బాయి పవర్ టైటిల్ ను బాబాయ్ కొట్టేశాడు. మరి ఈ టైటిల్ తో బాలయ్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home