ఎన్టీఆర్ 31: తాత గారి బ్యానర్ కాదు నాన్న గారి బ్యానర్!

0

నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ మధ్య అనుబంధం గురించి తెలిసిందే. అన్నపై ప్రేమతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ చిత్రంలో నటించాడు తారక్. ఆ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే తెరకెక్కిస్తారని ఇటీవల ప్రచారమైంది. కానీ ఇంతలోనే ట్విస్టు.

తాజా సమాచారం ప్రకారం.. కళ్యాణ్ రామ్ కి చెందిన ఈ బ్యానర్ లో తారక్ 31వ సినిమా ఉండబోదు. తారక్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం .. 30వ చిత్రం మాత్రమే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తెరకెక్కుతుంది. అటుపై 31వ సినిమా నుంచి నటించే ప్రతిదీ తారక్ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనున్నాయట. అందుకోసం యంగ్ యమ స్వయంగా నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపిస్తున్నారు. నాన్నగారి పేరు మీద ప్రారంభిస్తున్న ఈ బ్యానర్ లోనే తన కెరీర్ లో అన్ని సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక హరికృష్ణ పేరు మీద ప్రారంభించే ఈ బ్యానర్ కి ఎన్.హెచ్.కె ఆర్ట్స్ అనే షార్ట్ టైటిల్ ని ప్లాన్ చేశారు. ఇక ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తారక్ తన కెరీర్ 29వ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. 2021 జనవరి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ 30 చిత్రం 2021 సమ్మర్ లో రిలీజ్ కానుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-