తారక్ వారసుడి లుక్.. ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్

0

టాలీవుడ్ లో నటవారసుల గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నందమూరి వంశంలో నటవారసుల వెల్లువ గురించి తదనంతర పరిణామాలపైనా నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంటుంది. నందమూరి వంశంలో మూడో తరం స్టార్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడి హోదాని గౌరవాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న అరడజను స్టార్ హీరోల్లో తన పేరును నిలబెట్టుకోవడంలో తారక్ పెద్ద సక్సెస్ సాధించారు. అయితే నందమూరి వంశంలో నాలుగో తరం స్టార్ ఎవరు? అంటే.. అది ఇంకా సస్పెన్స్.

నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరో అవుతాడని చాలాకాలంగా ప్రచారం సాగుతున్నా అతడు అందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటివరకూ మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి బాలకృష్ణ ప్రకటించనేలేదు. అయితే నాలుగో తరం నటుడిగా బరిలో దిగే వారసుడు ఎవరు? అంటే వేరొక ఆప్షన్ ఉందని తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది.

ఇంతకీ ఎవరు ఆ నట వారసుడు? అంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వారసుడు అభయ్ రామ్. నేడు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అభిమానులకు అభయ్ రామ్ కొత్త లుక్ ని రివీల్ చేశారు తారక్. ఈ ఫోటోలో బుల్లి సుభాష్ చంద్రబోస్ వేషధారణలో మాస్టర్ అభయ్ రామ్ లుక్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. అభయ్ లో నటుడయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోటోకి తారక్ అభిమానుల నుంచి గొప్ప స్పందన లభించింది. బుల్లి రాముడు ఎంతో అందంగా ఉన్నాడంటూ కితాబిచ్చేస్తున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.. జైహింద్.. భారత్ మాతాకీ జై అంటూ అభిమానులు జోష్ చూపించారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రం నుంచి తారక్ లుక్ రివీలవుతుందని భావిస్తే ఊహించని విధంగా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారు. కొమరం భీమ్ గా తారక్ లుక్ ఎప్పటికి రిలీజవుతుందోనన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత తారక్ ఏ చిత్రంలో నటిస్తారు? అంటే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో తొలి ఛాన్స్ ఎవరికి అన్నది ఇప్పటికి సస్పెన్స్.
Please Read Disclaimer