ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్.. నిజమే..నా?

0

టాలీవుడ్ లో తిరుగులేని హీరోలలో ఒకడు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తొలి హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వరుసగా ఆది సింహాద్రి యమదొంగ బృందావనం లతో పాటు మొన్నటి జనతా గ్యారేజ్ అరవింద సమేత వరకు ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు తన అద్భుతమైన నటనతో డాన్సులతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఇక తాజాగా ఎన్టీఆర్ గురించి కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ అయిన ఎన్టీఆర్.. త్వరలోనే కొత్త టాలెంట్ లను సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ప్రోత్సహించ నున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం ఈ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తాడని సమాచారం. తన బ్యానర్ లో చిన్న సినిమాలను రూపొందించి తెలుగు తెరకు కొత్త దర్శకులను పరిచయం చేస్తాడట. మరి ఈ గాసిప్ నిజమో.. కాదో తెలియదు కానీ నిజమైతే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ వార్త ఎన్టీఆర్ చెవిన పడిందో.. లేదో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-