చిరంజీవి-త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్!

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో ఆచార్య (చిరు 152) ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కానీ మహేష్ కానీ నటించే వీలుందని ప్రచారం సాగుతోంది. ఆల్మోస్ట్ మహేష్ నే ఖాయం చేశారన్న ప్రచారం ఇటీవల హోరెత్తింది. అయితే దేనికీ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో మెగాభిమానులంతా కన్ఫ్యూజన్ తో ఉన్నారు.

ఇక ఈ సినిమా గురించి చర్చ సాగుతుండగానే చిరంజీవి నటించే 153వ చిత్రం గురించిన లీకులు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తో ఓ సినిమాని ప్లాన్ చేసిన త్రివిక్రమ్ ఆ మూవీకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తారక్ ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో జాయిన్ కానున్నాడు. ఈలోగానే మెగాస్టార్ చిరంజీవి తో మరో చిత్రానికి త్రివిక్రమ్ కథను రెడీ చేస్తున్నాడన్న సమాచారం ఉంది. ఈసారి చిరంజీవి నటించిన క్లాసిక్ చిత్రం `మంత్రిగారి వియ్యంకుడు` స్ఫూర్తితో అదే లైన్ తీసుకుని మోడ్రనైజ్ చేస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. బన్నితో అల వైకుంఠపురములో చిత్రానికి `ఇంటి గుట్టు` (సీనియర్ ఎన్టీఆర్ నటించిన క్లాసిక్) థీమ్ ని తీసుకుని సక్సెస్ చేశాడు. ఇప్పుడు చిరు కోసం మరో క్లాసిక్ మూవీ థీమ్ ని ఎంచుకుంటున్నాడన్న లీకులు అందుతున్నాయి.

మంత్రిగారి వియ్యంకుడు కథ ప్రకారం.. తన చెల్లెలిని మంత్రిగారి కుమారుడికి కట్టబెట్టాలన్న తపనతో ఓ అన్న గారు ఏం చేశాడన్న లైన్ ని ఎంచుకుంటాడట. ఇక పోతే ఇందులో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా ఓ కీలక పాత్రలో యంగ్ యమ ఎన్టీఆర్ నటిస్తాడని కూడా ప్రచారమవుతోంది. టాలీవుడ్ లో ఇదో క్రేజీ మల్టీస్టారర్ అవుతుందన్నకొత్త ప్రచారం మొదలైంది. ఇప్పటికే చిరంజీవి- మహేష్ కాంబినేషన్ అనగానే మెగాభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. అలాగే తదుపరి చిరంజీవి- ఎన్టీఆర్ కాంబినేషన్ పైనా అంతే ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇవన్నీ రూమర్లుగా మిగిలి పోకుండా అట్నుంచి కన్ఫర్మేషన్ తెలిస్తే బావుంటుంది. అప్పటివరకూ ఈ రూమర్లు ఆగేదెలా అన్నది సస్పెన్స్ గా మారింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-