RRR: ఆ విషయం కూడా లీక్ అయిందే!

0

ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో ‘RRR’ ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ‘RRR’ టీమ్ అధికారికంగా అప్డేట్లు పెద్దగా ఇవ్వడం లేదు కానీ ఏదో ఒక రూపంలో అవి మాత్రం బయట కు వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికే లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్స్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాల్లో రెగ్యులర్ గా నటించే వ్యక్తి చంద్రశేఖర్. ఈ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ పాత్ర గురించి మాట్లాడుతూ కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ విభిన్న గెటప్పులలో కనిపిస్తారని అన్నారు. ఇదిలా ఉంటే ఈమధ్యే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ‘RRR’ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా లో అజయ్ పాత్ర గురించి మరో విషయం లీక్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్.. చరణ్ తమ టీనేజ్ లోనే ఇంటినుంచి బయటకు వచ్చేస్తారు. ఈ ఇద్దరికి గురువు పాత్ర లో అజయ్ నటిస్తున్నారని.. ఎన్టీఆర్.. చరణ్ పాత్రలకు మార్గనిర్దేశం చేస్తారని అంటున్నారు.

‘RRR’ సినిమాను జులై లో విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు మాత్రం సినిమా వాయిదా పడేలా ఉందని అంటున్నారు. అయితే విడుదల తేదీపై రాజమౌళి టీమ్ మాత్రం ఇంకా స్పందించలేదు.
Please Read Disclaimer