హృతిక్ రోషన్ పై భార్య వ్యామోహం.. చంపేసిన ఎన్ఆర్ఐ

0

బాలీవుడ్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్ అంటే అభిమానించని వారు ఉండరు. అమెరికా లోని ఓ వ్యక్తి భార్య కూడా హృతిక్ పై పిచ్చి అభిమానాన్ని పెంచుకుంది. భార్య అలా హీరో కు బానిస కావడాన్ని జీర్ణించుకో లేని భర్త ఆమె ను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రవాస భారతీయుల చావుకు పరోక్షం గా హీరో హృతిక్ రోషన్ కారణమయ్యాడు. ఈ ఘటన అమెరికా లోని న్యూయార్క్ క్వీన్స్ ప్రాంతం లో చోటు చేసుకుంది.

అమెరికా లోని న్యూయార్క్ లో డొన్నె డొజోయ్ అనే గుజరాత్ కు చెందిన ప్రవాస భారతీయురాలు నివసిస్తోంది. మూడేళ్ల కిందట ఆమెకు గుజరాత్ కు చెందిన దినేశ్వర్ బుదిహాట్ తో పరిచయం ప్రేమగా మారి వివాహమైంది.

డొన్నె డొజోయ్ కు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే పిచ్చి అభిమానం.ప్రతీ రోజు అతడి సినిమా లే చూస్తూ నిద్రలోనూ అతడి నే కలవరించేంది. తీరు మార్చు కోవాలని భర్త దినేశ్వర్ చాలా సార్లు చెప్పినా భార్య డొజోయ్ వినలేదు. దీని పై తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. హృతిక్ రోషన్ తో భర్తను పోల్చి ఆనందించేంది. ఈ క్రమం లోనే రెండు వారాల మధ్య వీరిద్దరి మధ్య గొడవ జరగడం తో డొజోయ్ ను దినేశ్వర్ కొట్టాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లి పోయి స్నేహితురాలు అపార్ట్ మెంట్ లో ఉంటోంది. దీంతో డొజోయ్ పై మరింత పగ పెంచుకున్న దినేశ్వర్ ఆమెను చంపడానికి రెడీ అయ్యారు.

గొడవలు మరిచిపోయి హృతిక్ సినిమా చూసేందుకు వెళుదామని భార్య డొజోయ్ కు ఫోన్ చేశాడు దినేశ్వర్. దీంతో భర్త మాటల ను నమ్మి ఫ్లాట్ కు వచ్చింది డొజోయ్. దీంతో ఆమెను కత్తి తో పొడిచి హోవర్డ్ బీచ్ రిసార్ట్ కు వెళ్లి అక్కడ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని దినేశ్వర్ ఆత్మ హత్య చేసుకున్నాడు.

దీని పై పోలీసులు ఆరాతీయగా.. దినేశ్వర్ సున్నిత మనస్కుడని.. తన భార్య హృతిక్ ను అభిమానించడాన్ని తట్టు కోలేకే ఈ హత్య చేసినట్లు డొజోయ్ స్నేహితులు తెలిపారు.
Please Read Disclaimer