ఇది FIR స్టోరీనా.. ఎఫైర్ స్టోరీనా?

0

గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ప్రేమాయణం టాలీవుడ్ కోలీవుడ్ సర్కిల్స్ సహా తెలుగు రాష్ట్రాల అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ తో డేటింగులో ఉందని త్వరలో ఈ జోడీ పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారమవుతోంది. అయితే ఇది ప్రేమ పెళ్లికి దారి తీస్తుందా? లేదూ కేవలం స్నేహం మాత్రమేనా? అన్నదానికి సరైన ఆన్సర్ లేనేలేదు.

అలాగని రూమర్లను ఖండించనూ లేదు. ఇటీవలే విష్ణు విశాల్ తో కలిసి డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న జ్వాలా గుత్తా.. స్పాట్ నుంచి అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. కచ్ఛితంగా ఆ ఇద్దరూ లవ్ బర్డ్స్ అన్న సిగ్నల్ అయితే కనిపించింది. ఇక విష్ణు విశాల్ కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తెలుగు క్లాసిక్ హిట్ `జెర్సీ` తమిళ రీమేక్ లో అతడు నటిస్తున్నాడు. రానా తమిళంలో నిర్మిస్తున్నాడు. అలాగే గౌతమ్ మీనన్ శిష్యుడు మను ఆనంద్ రూపొందిస్తున్న FIR అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఎఫ్.ఐ.ఆర్ అంటే ఫైజల్ ఇబ్రహీం రాయిస్ అనేది పూర్తి పేరు. ఇదేదో పోలీస్ స్టేషన్ ఎఫ్.ఐ.ఆర్ కానేకాదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. విష్ణు విశాల్ పూర్తిగా గాయాలు నిండిన దేహంతో టైర్డ్ గా సంకెళ్లతో కనిపిస్తున్నాడు. బ్యాక్ డ్రాప్ లో మండుతున్న భారతదేశం సింబాలిక్ గా కనిపిస్తోంది. కశ్మీర్.. టెర్రర్ అంటూ పదాలు ఈ పోస్టర్ పై కనిపిస్తున్న తీరును బట్టి తీవ్రవాదం నేపథ్యంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ ఇదని అర్థమవుతోంది. ఈనెల 26న టీజర్ రిలీజవుతోంది. మాంజిమ మోహన్- రైజా విల్సన్-రెబా మోనికా జాన్ తదితరులు నటిస్తున్నారు. విష్ణు విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-