ఆ హీరోతో డేటింగ్ లో ఉన్నా.. త్వరలోనే పెళ్లి!

0

గుత్తా జ్వాల.. ఈ హైదరాబాదీ స్టార్ షట్లర్ భారత్ కు డబుల్స్ విభాగంలో ఎన్నో మరుపురాని విజయాలను అందించింది. ఆటకు గ్లామర్ జోడించి దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఆటకు రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. సొంతంగా అకాడమీ పెట్టి దాన్ని నిర్వహణలో శ్రమిస్తోంది. సామాజిక రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ వేడి పుట్టిస్తుంటుంది.

నా అకాడమీ కోసం ప్రభుత్వం ఏమీ సాయం చేయలేదని.. ఇల్లు అమ్మి అకాడమీ ప్రారంభించానని గుత్తాజ్వాల తెలిపారు. భారత్ కు పతకాలు అందించే వారిని తయారు చేస్తానన్నారు.

జాతీయ పార్టీల నుంచి పిలుపువచ్చిందని.. కానీ రాజకీయాలకు నా భావ సారూప్యతకు సరిపోదని తిరస్కరించానని గుత్తా జ్వాల తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తెలిపారు.

ఇక తన ప్రేమ బంధం గురించి జ్వాల మనసు విప్పారు. తాను ఒక తమిళ హీరో తో డేటింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని గుత్తా జ్వాల సంచలన విషయం చెప్పారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలన్నది నిర్ణయించుకోలేదని.. త్వరలోనే ఒక్కటవుతామని.. అందర్నీ ఆహ్వానిస్తానని గుత్తా తెలిపారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-