కోలీవుడ్ నటుడితో గుత్తా జ్వాల ప్రేమ

0

తరచూ వార్తల్లో ఉండే బ్యాడ్మింటన్ మాజీ స్టార్ గుత్తా జ్వాల పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా? అంటే అవునంటున్నారు. తరచూ ఆమెకు సంబంధించి ఏదో ఒక రూమర్ హడావుడి చేసినా.. దానికి సంబంధించిన ఆధారాలేవీ బయటకు రాలేదు. ఇటీవల కోలీవుడ్ నటుడితో ఆమెకు సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వాటిల్లో నిజం ఉందన్న విషయాన్ని గుత్తా జ్వాలనే చెప్పేశారు.

తన సోషల్ మీడియా ఖాతాలో కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తో ఆమె డేటింగ్ చేస్తున్న వైనాన్ని బయటపెట్టేశారు. తామిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని ఆమె పోస్టు చేశారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తమ ఇద్దరి ఫోటోల్ని ఆమె విడుదల చేశారు. తనను విష్ణు ముద్దాడుతున్న ఫోటోల్ని గుత్తా జ్వాల పోస్టు చేశారు.

తాజాగా పోస్టు చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలతో కోలీవుడ్ నటుడితో గుత్తా జ్వాల డేటింగ్ చేస్తున్నారన్న మాటకు బలం చేకూరినట్లైంది. ఇప్పటివరకూ విష్ణు విశాల్ పద్నాలుగు సినిమాల్లో నటించారు. వీరిద్దరి జోడి బాగుందన్న మాట సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కొత్త సంవత్సరం తొలి రోజునే తన ప్రేమను ప్రపంచానికి చెప్పేసిన జ్వాల.. అన్ని అనుకున్నట్లు సాగితే ఈ ఏడాదిలోనే ఒకటైనా ఆశ్చర్యం లేదంటున్నారు. గుత్తా జ్వాలకు గతంలో బ్మాడింటన్ మాజీ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తో వివాహమైంది. కొద్ది కాలం తర్వాత వీరిద్దరూ అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer