గుత్తా జ్వాల ని కూడా వేధించారట

0

దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది . ఇప్పటికే పలువురు నటీమణులు , సింగర్ లు తమ వేధింపుల విషయాన్నీ బహిర్గతం చేయగా తాజాగా వాళ్లతో శృతి కలిపింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల . ఈ భామ కెరీర్ అంతా కూడా వివాదాల మయంగా మారింది . కోచ్ పుల్లెల గోపీచంద్ పై పలుమార్లు సంచలన ఆరోపణలు చేసింది , అయినప్పటికీ ఈ భామకు తగిన న్యాయం జరగలేదు . ఇక ఒకదశలో బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పింది గుత్తా జ్వాల . తాజాగా తనకు జరిగిన అవమానం గురించ చెబుతూ ట్వీట్ చేసింది ఈ భామ . అయితే అతడు ఎవరు ? అన్నది మాత్రం పేరు వెల్లడించలేదు గుత్తా జ్వాల .

బ్యాడ్మింటన్ ని పక్కన పెడితే ఈ భామకు సినిమాల మీద మోడలింగ్ మీద బాగా ఇష్టం దాంతో పలుమార్లు ఫోటో షూట్ చేసింది కూడా . అలాగే సినిమాల్లో నటించాలని తహతహలాడింది కానీ యాక్టింగ్ రాకపోవడంతో నితిన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది కానీ ఆ ఐటెం సాంగ్ లో తేలిపోయింది పాపం . దాంతో మళ్ళీ సినిమాల మీద ద్రుష్టి పెట్టలేకపోయింది . వివాహ జీవితం వైఫల్యం చెందడం కూడా ఈ భామని కాస్త కుంగదీసింది .
Please Read Disclaimer