మగాళ్లకు కొత్త చిక్కులు తెస్తున్న స్టార్ హీరో?

0

ఇంట్లో వంట చేయటం.. బట్టలు మడత పెట్టటం.. పిల్లల్ని చూసుకోవటం.. స్కూల్ లో జరిగే పేరెంట్స్ మీట్ కు వెళ్లి రావటం లాంటి లిస్ట్ చదువుతుంటే.. అవును ఇంట్లో ఉంటే భార్య కదా ఈ పనులన్ని చేసేదనుకునేటోళ్లు చాలామందే ఉంటారు. కానీ.. ఇలాంటి పనులన్ని ఒక స్టార్ హీరో చేయటం ఊహించగలమా? యాక్షన్ హీరోగా రీల్ లో చెలరేగిపోయే తమిళ స్టార్ హీరో సూర్య రియల్ గా ఇవన్నీ చేస్తాడట.

తన తోటి నటి జ్యోతికను పెళ్లాడిన సూర్య.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని తాజాగా ఆమె వెల్లడించారు. కాస్త గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్న జ్యోతిక షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఇంటికి సంబంధించిన అన్ని పనుల్ని సూర్యనే చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తానెంతో లక్కీ అని మురిసిపోతుంది. ఇంటి పనుల విషయంలో తన భర్త పూర్తిగా అండగా నిలుస్తారని.. ఒక్క ఇంటి పనులు మాత్రమే కాదు.. భర్తగా తన పూర్తి సహకారాన్ని అందిస్తారని చెప్పారు.

తండ్రిగా పిల్లలకు సంబంధించిన అన్ని పనులు సూర్య చూసుకుంటారన్నారు. తాజాగా జాక్ పాట్ మూవీ ఆడియో రిలీజ్ రోజున పిల్లలకు స్కూల్లో పేరెంట్స్ మీట్ ఉందని.. ఉదయమే 7 గంటలకు మీటింగ్ కు వెళ్లి ఆ తర్వాత ఆడియో ఫంక్షన్ కు వచ్చి.. మధ్యాహ్నం నుంచి తన సినిమా షూట్ కు వెళ్లారని.. ఆ ఒక్కరోజే కాదు.. అలా ఎన్ని రోజులో పనిలో సాయం చేస్తారని గొప్పగా చెప్పుకొచ్చింది.

సూర్య వరకూ బాగానే ఉంది కానీ.. ఆ స్టార్ హీరోను ఉదాహరణగా చూపించి ఇంటి పనులన్ని చేయాలన్న డిమాండ్ ఇళ్లల్లో పెరిగిపోవటం ఖాయమని మగరాయుళ్లు తెగ ఫీల్ అవుతున్నారు. వారి వేదన చూస్తుంటే.. సూర్య మగాళ్లకు మూకుమ్మడి శత్రువుగా మిగులుతారంటూ సరదాగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మారిన కాలానికి తగ్గట్లుగా మారిన స్టార్ హీరో సూర్య చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పక తప్పదు.
Please Read Disclaimer