స్టార్ హీరో వైఫ్ పొలిటికల్ స్కెచ్

0

సౌత్ స్టార్ హీరో సూర్య సతీమణి.. మేటి కథానాయిక జ్యోతిక రాజకీయారంగేట్రం చేయబోతున్నారా? అంటే అవుననే కోలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. జ్యోతిక పొలిటికల్ వార్ కి సూర్య అన్ని వైపులా లైన్ క్లియర్ చేస్తున్నారని.. అందుకు తగ్గట్టే జ్యోతిక ఫిల్మీ కెరీర్ ని ప్లాన్ చేస్తున్నారని ప్రచారమవుతోంది. జ్యోతికకు తమిళ ప్రజల్లో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇక రాజకీయాల్లోకి పంపాల్సిన సమయం ఆసన్నమైందని సూర్య భావిస్తున్నారట.

ఇప్పటికే జ్యోతిక నటిగా పునరారంగేట్రం పెద్ద సక్సెసైంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అభిమానులకు మరింతగా చేరువయ్యారు. తమిళనాడు మహిళలకు రోల్ మోడల్ గా జ్యోతిక తనని తాను తీర్చి దిద్దుకున్నారు. ఇక సామాజిక సేవలోనూ సూర్య- జ్యోతిక జంట నిరంతరం పేరు తెచ్చుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఎందరో పేదలకు .. ఆడవారికి.. పిల్లలకు సాయం చేశారు ఈ జంట. అందుకే ఈ ధృక్పథం వల్లనే జ్యోతిక పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారట.

ఇటీవల తమిళ రాజకీయాల్లో స్టార్ల ఆరంగేట్రం ప్రముఖంగా చర్చకొచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్.. విశ్వనటుడు కమల్ హాసన్ సహా విశాల్ రాజకీయాల్లో ప్రవేశించారు. ఇలయదళపతి విజయ్ సైతం రాజకీయారంగేట్రానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి సమయంలో జ్యోతిక సైతం రాజకీయాల్లోకి రావాల్సిందేనని అభిమానులు కోరుతున్నారట. ఆ క్రమంలోనే లాంగ్ టైమ్ సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జ్యోతిక క్రియా శీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. అందుకు భర్త సూర్య అభ్యంతరం చెప్పడం లేదని తెలుస్తోంది. పొలిటికల్ గా జ్యోతిక ఇమేజ్ సైతం తనకు ప్లస్ అవుతుందని సూర్య భావిస్తున్నారు. పైగా తనకు ఇష్టమైనది ఏదైనా అతడికి సమ్మతమే. ఇప్పటికే సొంతంగా 2డి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సినిమాల నిర్మాణంలో జ్యోతిక తనవంతు పాత్రను పోషిస్తున్నారు. రాజకీయారంగేట్రం చేస్తే తప్పేం లేదని భావిస్తున్నారట. 36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక వరుసగా సోషల్ కాన్సెప్ట్ బేస్డ్ కథల్నే ఎంచుకుంటున్నారు. ఇటీవల నాచియార్ చిత్రంలో స్ట్రిక్టు పోలీస్ అధికారిగా మెప్పించారు. ప్రస్తుతం రాక్షసి (రాచ్చసి)గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభుత్వ స్కూళ్ల అవసరం ఏమిటి? అన్నది సందేశాత్మకంగా చూపిస్తున్నారట. గవర్నమెంట్ స్కూళ్ల పై చిన్న చూపును ప్రశ్నిస్తే.. ప్రయివేటు స్కూళ్లనే ఎందుకు గొప్పగా భావిస్తున్నారు? అసలు ప్రభుత్వ విద్య పరంగా ఏంటి సమస్య ? భారతీయ విద్యా వ్యవస్థ కోసం ఓ ప్రభుత్వ టీచర్ ఏం చేసింది? అన్న కథతో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకనటి రేవతితో కలిసి జాక్ పాట్ అనే వేరొక చిత్రంలోనూ జ్యోతిక నటిస్తున్నారు. సినీకెరీర్ కి డోఖా లేకుండానే రాజకీయాల్లోనూ రాణించాలన్నది జ్యోతిక ప్లాన్ అని తెలుస్తోంది.
Please Read Disclaimer