కబడ్డీ కోచింగ్ ఇవ్వబోతున్న హీరో

0

హీరో గోపిచంద్ కు అస్సలు టైం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సమయంలో చాణక్య అనే సినిమాను చాలా నమ్మకంతో చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాణక్య చిత్రం కూడా గోపీచంద్ కు సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. అయితే గోపీచంద్ అదృష్టం బాగుందో ఏమో కాని ఫ్లాప్ లు పడ్డా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తన తదుపరి చిత్రంలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈమద్య కాలంలో పలు సినిమాలు క్రీడా నేపథ్యంలో వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో హీరోలు క్రీడా కారులుగా కనిపిస్తూ ఉంటే మరి కొన్ని సినిమాల్లో హీరోలు ట్రైనర్స్ గా కనిపిస్తున్నారు. తమిళంలో ఇటీవల తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రంలో కూడా విజయ్ ఫుట్ బాల్ ట్రైనర్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇక గోపీచంద్.. సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కబడ్డీ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

కబడ్డీ అనేది తెలుగు వారికి చాలా దగ్గరగా ఉంటుంది. తెలుగు వారు అమితంగా అభిమానించే ఆట కూడా. అందుకే కబడ్డీని నేపథ్యంగా తీసుకుని సంపత్ నంది స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడని సమాచారం అందుతోంది. ఇక హీరో గోపీచంద్ అమ్మాయిల కబడ్డీ టీంకు కోచ్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ఇంతకు ముందు సినిమాల్లో మాదిరిగానే కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Please Read Disclaimer