200 కోట్ల క్లబ్ కూతవేటు దూరమే

0

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రి స్టార్ ని చేసిన చిత్రం `అర్జున్ రెడ్డి`. టాలీవుడ్ చరిత్రలో కల్ట్ క్లాసిక్ జోనర్ లో వచ్చి గేమ్ ఛేంజర్ గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్ లో `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ – కియారా అద్వాని జంటగా నటించారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఉత్తరాదిన షేక్ చేస్తోంది. రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు అలవాటు పడిపోయిన బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. క్రిటిక్స్ నెగెటివ్ గా స్పందించినా వారి రివ్యూస్ ఏవీ ఈ సినిమాపై ప్రభావాన్ని చూపించలేదు.

బాలీవుడ్ సినీ పండితుల్నే విస్మయపరుస్తున్న ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధిస్తోంది. ఎంత మంది ఎంత క్రిటిసైజ్ చేసినా వారి మాటలన్నీ ట్రాష్ అని నిరూపిస్తూ తొలి వారమే 134 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ క్రిటిక్స్ .. సెలబ్స్ ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఈ వారాంతం వరకు 200 కోట్ల మైలు రాయిని అవలీలగా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సందీప్ వంగాకు బాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ మామూలుగా లేదని తెలుస్తోంది.

పులవురు క్రేజీ హీరోలు సైతం సందీప్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా క్రేజ్ని గమనించిన కరణ్ జోహార్ టాలీవుడ్ హిట్ ఫిల్మ్ `జెర్సీ` రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. దీన్ని షాహీద్ కపూర్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. అలాగే పలువురు బాలీవుడ్ టాప్ స్టార్లు సందీప్ వంగాతో సినిమాలు చేయాలన్న కుతూహాలంతో ఉన్నారట.