కాజల్ వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయట!

0

దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కాజల్. ఈమద్య కాలంలో ఈమె ప్రాభవం కాస్త తగ్గింది. అడపా దడపా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ లు వచ్చినా ఈమె కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం తాను నటించిన తమిళ చిత్రం ‘పారిస్ పారిస్’ విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఆ సందర్బంగా కాజల్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పారిస్ పారిస్ చిత్రం హిందీ క్వీన్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. హిందీలో ఎలా అయితే ఉందో తమిళంలో ఉన్నది ఉన్నట్లుగా చేశాం. ఎక్కడ ఎలాంటి మార్పు చేయకున్నా కూడా తమిళ వర్షన్ కు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై కాజల్ విమర్శలు వ్యక్తం చేసింది. సెన్సార్ తీరుపై ఇప్పటికే పలు సార్లు స్పందించిన కాజల్ మరోసారి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక తీరుగా సెన్సార్ ఉండటం ఏంటీ అంటూ ప్రశ్నించింది. ఒకే సినిమాకు ఇన్ని రకాలుగా సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవ్వడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇకపై తాను బోల్డ్ కంటెంట్ పాత్రలు సినిమాలు చేయబోను అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ ప్రస్తుతం నీకు హీరోయిన్ గా ఛాన్స్ రావడమే కష్టంగా ఉంది.. ఇంకా నీవు బోల్డ్ కంటెంట్ పాత్రలు చేయనంటూ కామెంట్స్ చేస్తుంటే నవ్వు వస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేసినా.. బోల్డ్ కంటెంట్ చేసినా కూడా నార్మల్ గా నటించినా కూడా కాజల్ కెరీర్ తుది దశకు చేరుకుందంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Please Read Disclaimer