ఫస్ట్ షూట్లో పాల్గొన్న కాజల్.. త్వరలోనే సెట్స్ లోకి..

0

రోజులు గడిచేకొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో చాలా మంది సినీ తారలు సినిమా షూటింగులలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పటికే సెట్ కి వచ్చేసిందట. సోమవారం కాజల్ ముంబైలోని ఒక ఫిల్మ్ స్టూడియోలో ఒక ప్రముఖ బ్రాండ్ కోసం యాడ్ షూట్లో పాల్గొంది. ఫేస్ మాస్క్లు గ్లోవ్స్ పిపిఇ కిట్లు ఇంకా సామాజిక దూరం పాటించింది. అన్ని అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ ముగిసే వరకు అనుసరించిందట. కాజల్ అగర్వాల్ అంటేనే కుర్రాళ్ళు మనసులు పారేసుకుంటారు. అలాంటి కాజల్ అభిమానుల పై గ్లామర్ వర్షం కురిపించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. మిలియన్ల సంఖ్యలో అభిమానులను కలిగిన కాజల్ కెరీర్ ముగిసింది అనుకున్న ప్రతిసారి తనని తాను నిరూపించుకుంటూనే ఉంది.

ఈ సోయగాల కళ్ల సుందరి సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక ప్రస్తుతం యాడ్ షూట్స్ అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ షూటింగులో పాల్గొంటుంది. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ అంటే ఇండియా మొత్తం సుపరిచితమే. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ తో రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’లో కూడా అవకాశం దక్కించుకుంది అమ్మడు. ఇక బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహం కొత్త సినిమాలో కూడా కాజల్ త్వరలో నటించనుంది. ప్రస్తుతం కాజల్ చేస్తున్న మూడు సినిమాలు పెద్దవే. అంటే తన కెరీర్ ఇంకా అయిపోలేదని చెప్పకనే చెబుతోంది బ్యూటీ క్వీన్ కాజల్. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న ఈ భామ త్వరలోనే సెట్స్ లో కనిపించనుందన్న మాట!
Please Read Disclaimer