ప్రభాస్ కు వింత కాంప్లిమెంట్ ఇచ్చిన కాజల్

0

హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను వర్క్ చేసిన హీరోల గురించి ఒక్క వారి గురించి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ప్రభాస్ గురించి ‘ఐరన్ మ్యాన్ మరియు హల్క్’ ల కాంబినేషన్ ప్రభాస్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రభాస్ కు కాజల్ ఇచ్చిన ఆ వింత కాంప్లిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమానులు ఆ వీడియో క్లిప్ ను తెగ షేర్ చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల్లో ప్రముఖ పాత్రలైన ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

హాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్స్ కాంబినేషన్ ప్రభాస్ అంటూ కాజల్ కామెంట్ చేయడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సాహో ప్రమోషన్ లో ప్రభాస్ కూడా కాజల్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెతో వర్క్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని అన్నాడు. కెరీర్ ఆరంభంలో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అంతగా బాగుండేది కాదని కాని ఇప్పుడు ఆమె చాలా మోడ్రన్ గా మారిపోయి మంచి డ్రెస్సింగ్ సెన్స్ ను కలిగి ఉందని ప్రభాస్ కామెంట్స్ చేశాడు.

వీరిద్దరి కాంబోలో ‘డార్లింగ్’ మరియు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలు వచ్చాయి. రెండు కూడా సూపర్ హిట్ చిత్రాలే అవ్వడంతో వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. కాజల్ ఇంకా హీరోయిన్ గా నటిస్తూనే ఉంది కనుక ప్రభాస్ రాబోయే సినిమాల్లో మరోసారి కాజల్ కు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడాలి.
Please Read Disclaimer