వంటలక్కగా మారిన కాజల్ అగర్వాల్

0

అదేంటి.. కాజల్ వంటలక్కగా మారడమేంటి? – కార్తీక దీపం సీరియల్లో మరి మా వంటలక్క ఎక్కడికి పోయింది?..అని ఆలోచిస్తున్నారా…! అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే…

హీరోయిన్ అనగానే సినిమా షూటింగుల హడావుడి – షాపింగ్ మాల్స్ సందడి – ఫొటో షూట్లు.. ఇవే ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా మాక్సిమమ్ సినిమా సంగతులే చెబుతుంటారు. అయితే కరోనా వైరస్ పుణ్యమా అని సినిమా షూటింగులన్నీ బంద్ అయిపోయాయి. హీరోయిన్లు ఇంటికే పరిమితమై క్వారంటైన్ అయ్యారు. స్వీయ నిర్బంధంలో ఉన్న కాజల్ కొత్త దారిలో వెళ్లింది. ఇంకేముంది ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి వంటలక్కగా మారిపోయింది. ఈరోజు ఉదయం కాజల్ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి అభిమానులతో చిట్ చాట్ చేసింది. అయితే ఈసారి చాటింగ్ మాత్రం కాస్త విభిన్నంగా కనిపించింది. కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పూస గుచ్చినట్టు వివరించింది. అలాగే వంట గదిలోకి వెళ్లి ఆమ్లేట్ వేయడంలో కొన్ని చిట్కాల్ని – కొత్త పద్ధతుల్నీ అభిమానులతో పంచుకుంది. అంతటితో ఆగకుండా నేను వంట బాగానే చేస్తాను – కానీ అది ఎలా వుంది అనేది తిన్నవాళ్లే చెప్పాలి. నా వరకూ వంట చేయడం ఓ సరదా. నాకు నచ్చిన పదార్థాల్ని నాకు నేనే వండుకొని తినడం ఇష్టం అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. కరోనా వల్ల వచ్చిన ఈ విరామం మన కాజల్ పాపకి ఈ విధంగా ఉపయోగపడుతోందన్నమాట.

ఇదిలావుండగా కాజల్ ప్రస్తుతం కమలహాసన్ సరసన ‘భారతీయుడు-2’ – మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మంచు విష్ణుతో కలిసి ‘మోసగాళ్ళు’ అనే పాన్ ఇండియా మూవీలో కూడా కనిపించనుంది. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్న ఆ అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer