సాహో వదులుకున్న కాజల్ రీజన్ అదే!

0

‘సాహో’ సినిమాలో ఇటివలే రిలీజయిన ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ బాగా పాపులర్ అయింది. లిరిక్స్ అటు ఇటుగా ఉన్నా ట్యూన్ – పిక్చరైజేషన్ తో సాంగ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఈ సాంగ్ లో ప్రభాస్ తో హాట్ డాన్స్ తో కనివిందు చేసింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ సాంగ్ తో హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ భామ. అయితే ఈ సాంగ్ కోసం ముందుగా సౌత్ లో పాపులారిటీ ఉన్న కాజల్ ని అనుకున్నారట మేకర్స్. కాజల్ తో యూ.వి.నిర్మాతలు సంప్రదింపులు కూడా జరిపారట.

అడిగిన వెంటనే సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ తన రెమ్యునరేషన్ కింద రెండు కోట్లు డిమాండ్ చేసిందట. ఆ సాంగ్ కోసం అంత బడ్జెట్ కేటాయించలేని మేకర్స్ అప్పుడు కాజల్ కి బదులు జాక్వెలిన్ ను తీసుకున్నారట. అలా ‘సాహో’లో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం మిస్సయిందట కాజల్.

ప్రస్తుతానికి ‘సాహో’ని మిస్సయిన కాజల్ అంటూ ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే నిజంగా కాజల్ రెమ్యునరేషన్ దగ్గరే తేడా వచ్చిందా..లేదా ఇంకేదైనా రీజన్ ఉందా అనేది కాజల్ చెప్తేనే తెలుస్తుంది. మరి కాజల్ ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home