చందమామ మెరుపులు

0

అందాల చందమామా కాజల్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. అలానే పారిస్ పారిస్ చిత్రంతోనూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోగానే కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 చిత్రంలోనూ కాజల్ కథానాయికగా అవకాశం అందుకుందన్న వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ చర్చలు పూర్తయి – నాయికగా ఫైనల్ అయ్యిందన్న శుభవార్త ఇది వరకూ అందింది.

అదంతా సరే.. ఈ ఆనంద సమయంలో దీపావళిని కాజల్ అంతే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ దీపావళి పండుగను కుటుంబంతో కలిసి కాజల్ ఉల్లాసంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోల్ని ఈ ముద్దుగుమ్మ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ముఖ్యంగా దీపావళి కోసం స్పెషల్ డిజైన్డ్ డ్రెస్ లో కాజల్ మైమరిపించింది.

ఈ డిజైనర్ డ్రెస్ లో కాజల్ నిండు చందమామను తలపించింది. మెడలో ముత్యాల హారం .. దానికి కాంబినేషన్ ఎవి జూకాలు.. ఇంచుమించు ముత్యాల రంగును తలపించే కలర్లో డిజైనర్ డ్రెస్ మైమరిపించింది. ఈ డ్రెస్లో చందమామ అందం ద్విగుణీకృతం అయ్యింది. ఇక తన మామ్ – డాడ్ తో పాటు – స్నేహితులతో కాజల్ దీపావళి పండుగను జరుపుకున్న ఫోటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
Please Read Disclaimer