బాల్కనీలో విరిసిన సన్నజాజి

0

కాజల్ అగర్వాల్ 15 ఇయర్స్ ఇండస్ట్రీ.. అయినా హీరోయిన్ గా కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్త తరం హీరోయిన్లు ఎంతమంది వచ్చినా కాజల్ మాత్రం వారికి గట్టిపోటీ ఇస్తూ ఆఫర్లు సాధిస్తోంది. ఇప్పటికీ సూపర్ గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ.. ఫిట్ గా ఉంటూ కుర్రభామలకు గ్లామర్ ఛాలెంజ్ విసురుతోంది. ఇక ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా సోషల్ మీడియాకు ‘వాడకం’ అంటే ఏంటో చూపిస్తోంది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా స్టోరీస్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కాజల్ ముంబైలోని తన ఫ్లాట్ బాల్కనీలో నిలుచుంది. అందరు బాల్కనీలో నిలబడతారు.. మరి అలాగే నిలుచుంటే కాజల్ స్పెషాలిటీ ఏముంటుంది. అందుకే అప్సరస భంగిమలు ఇస్తూ నిలుచుంది. షర్టు.. ఒక షార్టుతో ఎంత హాట్ గా కనిపించవచ్చో అంత హాటుగా కనిపించేసింది. 34 ఏళ్ళ వయసులో ఇలా సన్నజాజి తీగలా కనిపించడం ఎంత కష్టమనేది ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. నిజానికి అదొక్కటి సాధించగలిగినవారు ప్రపంచంలో మిగతా కష్టమైన పనులు అవలలీలగా చెయ్యగలుగుతారు.

ఏదైతేనేం.. కాజల్ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే ‘భారతీయుడు-2’ లో నటిస్తోంది. హిందీలో ‘ముంబై సాగా’ అనే సినిమాలో నటిస్తోంది. ‘కాల్ సెంటర్’ అనే మరో తెలుగు ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది. ఇవి కాకుండా ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ రిలీజ్ కావాల్సి ఉంది.
Please Read Disclaimer