కాజల్ న్యాచురల్.. వింటేజ్ లుక్

0

టాలీవుడ్ లోని సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే సీనియారిటీ అనేది యాక్టింగ్ లో మాత్రమే. లుక్స్.. స్టైల్.. గ్లామర్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న జూనియర్ మోస్ట్ భామలతో పోటీ పడగలదు. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే కాజల్ చాలా యాక్టివ్. ట్విట్టర్ లో 2.72 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 11.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వీరందరి కోసం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి కాజల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో ఒక ఫోటోకు “క్యాచింగ్ లైట్ # సిలౌట్స్ # షాడోస్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో షూట్ ను షాడోస్..సిలౌట్ థీమ్ తో చేయడంతో కొత్తగా ఉంది. బంగారు రంగులో ఉండే చీర.. ఎరుపు రంగు బ్లౌజ్ లో వింటేజ్ స్టైల్ లో కనిపిస్తూ ఉంది. కొప్పు కట్టి.. తలలో పూలు తురుముకోవడమే కాకుండా చేతిలో కూడా ఒక పెద్ద పువ్వు పట్టుకొని పాతకాలపు మోడల్ లాగా పోజిచ్చింది. అన్నీ ఫోటోలలో అందాల విందేమీ చేయలేదు కానీ ఒక్క ఫోటోలో మాత్రం నడుము ఒంపులతో కూడిన భారతీయ చీరకట్టు అందాన్ని రంగరించింది. కరెక్ట్ గా చెప్తే ఈ ఫోటోలు రవివర్మ కుంచెతో గీసిన చిత్రాలలాగా ఉన్నాయి.

ఈ ఫోటోలకు లైకులే లైకులు.. కామెంట్లే కామెంట్లు. “స్టన్నింగ్ బ్యూటీ”.. “న్యాచురల్.. వింటేజ్ లుక్”.. “అమేజింగ్లీ బ్యూటిఫుల్”.. “సెవెంటీస్ హీరోయిన్ లా ఉన్నావే” అంటూ కామెంట్లు పెట్టారు. కానీ డిమ్ లైట్ ఫోటో ఒక నెటిజన్ కు మాత్రం నచ్చలేదు.. “ఇదేదో హారర్ ఫిలింలో దెయ్యంలా ఉందే” అంటూ కామెంట్ పెట్టాడు. నిజమే.. అన్నీ అందరికీ నచ్చాలని లేదు.
Please Read Disclaimer