ప్రేమ లో కాజల్ అగర్వాల్

0

టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోయిన్ల లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి ఒకటిన్నర దశాబ్దం అయినా ఇంకా హీరోయిన్ గా కొన సాగుతూ.. సేమ్ గ్లామర్ కొనసాగిస్తూ కొత్త హీరోయిన్లకు కన్నుకుట్టేలా చేస్తోంది. అంతే కాదు.. ఈ జెనరేషన్ భామలు సోషల్ మీడియా లో ఎంత స్పీడ్ గా ఉంటారో.. కాజల్ కరెక్ట్ గా దానికి డబల్ స్పీడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ జెనరేషన్లో పని కంటే ముఖ్యం ప్రమోషన్ కాబట్టి!

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు “మనీష్ అరోరా ఎక్స్-కూవ్స్ వారి సెక్విన్ డ్రెస్ తో లవ్ లో పడిపోయా. వారి కలెక్షన్ డ్రెస్సులు ఒక సెలబ్రేషన్ లాగా ఉన్నాయి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఇదంతా జస్ట్ క్యాజువల్ గా పోస్ట్ చేసిందో.. లేదా పెయిడ్ ప్రమోషనో తెలియదు. అయినా మన పిచ్చి కానీ ఆదాయం లేకుండా కాజల్ ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టదని టాలీవుడ్ టాక్. ఇది కూడా ప్రమోషన్ అయ్యే ఉంటుంది. పనిలో పనిగా సెల్ఫ్ ప్రమోషన్. స్వామికార్యం.. స్వకార్యం.. నెటిజన్ల కు సంతోషం. కార్పోరేట్ భాషలో విన్/విన్ డీల్ ఒక్కటే జనాల కు తెలుసు. కాజల్ ఇన్వాల్వ్ అయింది కదా.. అందుకే ఇది విన్-విన్-విన్ డీల్.

అయినా ఎవరైనా హ్యాండ్సమ్ మ్యాన్ తో ప్రేమ లో పడాల్సిన వయసు లో కాజల్ సెక్విన్ డ్రెస్ తోప్రేమ లో పడడం ఏంటో కాజల్ కే తెలియాలి. సరే ఇవన్నీ పక్కన పెడితే డ్రెస్ మాత్రం అదిరి పోయింది. అందాల విందులు గట్రా లేవు కానీ స్టైలిష్ గా ఉంది.. మోడరన్ గా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే ‘భారతీయుడు-2’ లో నటిస్తోంది. హిందీలో ‘ముంబై సాగా’ అనే సినిమా లో నటిస్తోంది. ‘కాల్ సెంటర్’ అనే మరో తెలుగు ఇంగ్లీష్ ద్విభాషా చిత్రం లో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer