వ్వావ్.. మేకప్ లెస్ చందమామ

0

చక్కనమ్మ ఏం చేసినా అందమే. అలా ఎయిర్ పోర్ట్ లో సింపుల్ గా నవ్వేసుకుంటూ ఎటో జారుకుంటున్న ఈ చందమామను చూశాక ఫ్యాన్స్ ఇలానే భావిస్తారు. అసలు కాజల్ కి మేకప్ ఉన్నా అందమే లేకపోయినా అందమే. అప్పట్లో ఎందుకనో అసలు అందంగా ఉండదు అంటూ ఓ ప్రచారం సాగించారు కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఇదిగో ఈ లుక్ చూశాక అర్థమవుతుంది.

కాజల్ చాలా సాధా సీదాగా ఇలా ఆరుబయట కనిపించేసరికి మరోసారి ఈ అమ్మడి అందంపై యూత్ సామాజిక మాధ్యమాల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. అసలు మేకప్ లేకపోయనా ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తోంది. మేకప్ లేకపోతే కాజల్ ను చూడలేం అంటూ భావించేవారికి ఇదో షాక్ అనే చెప్పాలి.

ఆ పింక్ రంగు డ్రెస్ కి కాంబినేషన్ గా కాంట్రాస్ట్ బ్లూ కలర్ హ్యాండ్ బ్యాగ్ సరిగ్గా కుదిరింది. ఫ్లాట్ గా చెప్పులు.. సింపుల్ హెయిర్ స్టైల్ .. ఆ సింపుల్ గ్లాసెస్.. తో స్మైలిస్తూ ఆకట్టుకుంది. చేతిలో పుస్తకంతో పాటు డెనిమ్ జాకెట్ కనిపిస్తోంది. అన్నట్టు చందమామ ఇటీవల హిందీ సినిమాలో నటిస్తోంది కాబట్టి అటూ ఇటూ ఇలా విమానాశ్రయాల వెంట పరిగెడుతూ మేకప్ వేసుకునే టైమ్ లేక ఇలా చేస్తోందా? అప్పట్లో మేకప్ లెస్ ఫోటోషూట్ అంటూ చేసిందంతా ఓన్లీ పబ్లిసిటీయేనా? బాహ్య సౌందర్యం అంతః సౌందర్యం అంటూ చాలానే క్లాస్ తీస్కుంది కదా?
Please Read Disclaimer