ఇండియన్ 2 తర్వాత పెళ్లెనా?

0

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో 2007వ సంవత్సరంలో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్ పుష్కర కాలం పాటు హీరోయిన్ గా కొనసాగింది. దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కొనసాగిన కాజల్ ఈమద్య కాలంలో కాస్త ఆఫర్లు తగ్గడంతో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమెకు సన్నిహితంగా ఉండే వారు కొందరు కాజల్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో పదే పదే మాట్లాడుతున్నారు.

ఏ హీరోయిన్ కైనా ఒక ఏజ్ వరకే ఆఫర్లు వస్తాయి. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా రావు. ప్రయత్నాలు చేసి సమయం వృదా. ఆ విషయాన్ని కాజల్ బాగా వంట పట్టించుకుందేమో పెళ్లికి సిద్దం అయ్యింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చెల్లికి పెళ్లి చేసి చెల్లి కొడుకుతో ఆడుకుంటూ కనిపిస్తున్న కాజల్ తాను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంను చేస్తున్న కాజల్ కు మరే పెద్ద ప్రాజెక్ట్ దక్కలేదు. వచ్చే ఏడాదికి ఇండియన్ 2 పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ 2 పూర్తి అయిన వెంటనే కాజల్ పెళ్లి చేసుకుంటుందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి విషయమై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కోరుకున్న వాడు దొరికితే చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

కనుక ఈమెకు వచ్చే ఏడాది వరకు పెళ్లి ఫిక్స్ అవ్వడం లేదా పెళ్లి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇండియన్ 2 తో మళ్లీ ఫామ్ లోకి వచ్చి కాజల్ సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాజల్ కెరీర్ మాత్రం చివరి అంకంకు చేరిందనేది మాత్రం అందరు చెబుతున్న మాట.
Please Read Disclaimer