ముద్దుగుమ్మ సొంత బ్యానర్ ఏమైంది?

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జోరు ఈమద్య కాస్త తగ్గింది. ఈ అమ్మడి వయసు పెరగడంతో పాటు స్టార్ హీరోలు అందరు కూడా ఇప్పటికే ఈమెతో నటించేశారు. దాంతో ఈమెతో మళ్లీ మళ్లీ నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. సీనియర్ హీరోలకు జతగా నటించాల్సి వస్తుంది. కాజల్ హీరోయిన్ గా కొనసాగేది మరికొంత కాలమే అంటూ ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో కాజల్ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసినట్లుగా ప్రచారం జరిగింది.

కాజల్ నిర్మాణంలో తమన్నా సహ నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అ! 2’ చిత్రాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాజల్ అగర్వాల్ ఫిల్మ్స్ అంటూ ఒక బ్యానర్ ను కూడా కాజల్ రిజిస్ట్రర్ చేయించిందట. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కాస్త ఖర్చు చేసిందని సినిమా పట్టాలు ఎక్కించే సమయానికి బాబోయ్ నా వల్ల కాదంటూ తప్పుకుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ వర్మ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మాతగా మారేందుకు సిద్దం అయిన కాజల్ అతడు చెప్పిన బడ్జెట్ కు షాక్ అయ్యిందని.. అంత డబ్బు తన వల్ల కాదని సినిమా నిర్మాణం నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా నిర్మాణం కాకుండా తక్కువ బడ్జెట్ తో ఈమె వెబ్ సిరీస్ లను నిర్మించాలని భావిస్తోందట. సినిమా నిర్మాణం ఆగిపోయినా బ్యానర్ మాత్రం అలాగే ఉంది కనుక వెబ్ సిరీస్ లు ఈమె నుండి వరుసగా వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.
Please Read Disclaimer