కాజల్ అగర్వాల్..మరో ముదురు హీరో సరసన!

0

‘మన్మథుడు 2′ అంటూ ఇటీవలే ప్రేక్షకులను పలకరించినప్పటికీ నాగార్జునను ముదురు హీరో అని చెప్పక తప్పదు. ఫుల్ ఫిట్ గానే ఉన్నా – ఆయన సీనియర్ హీరో అయిపోయినట్టే. అయితే హీరోగా ఇంకా నాగ్ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇమేజ్ గొడవలను పక్కన పెట్టి.. నాగార్జున ప్రయోగాలకూ రెడీ అంటూనే ఉంటారు.

ఈ క్రమంలో నాగార్జున పోలీసాఫీసర్ గా ఒక సినిమాలో నటించబోతున్నారు. సాల్మన్ అనే కొత్త దర్శకుడికి నాగార్జున ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ అంటూ పోలీస్ గా కనిపించి ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నాడు నాగార్జున. అయితే ఈ సారి పోలీసాఫీసర్ గా రాణించాలని ఫిక్సయ్యారట. సాల్మన్ దర్శకత్వంలో నాగ్ పోలీసాఫీసర్ గా నటించడం ఒక విశేషం అయితే – ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటం గమనార్హం.

ఇప్పుడు సీనియర్ హీరోలకు మాత్రమే జోడీగా నటిస్తూ ఉంది కాజల్. గతంలో నాగచైతన్యకు జోడీగా నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఆయన తండ్రికి జోడీగా నటిస్తూ ఉంది. మొదట రామ్ చరణ్ సరసన నటించిన ఈ హీరోయిన్ చిరంజీవితో నటించినట్టుగా ఇప్పుడు – చైతూ తండ్రి సరసన నటిస్తూ ఉంది!
Please Read Disclaimer