హాలీవుడ్ కోసమేనా చందమామ కష్టం?

0

చందమామ కాజల్ దశాబ్ధం పైగానే సౌత్ లో కథానాయికగా కెరీర్ సాగిస్తోంది. నవతరం భామల వెల్లువ ఉన్నా.. అన్నిటినీ తట్టుకుని స్టార్ హీరోయిన్ గా తిరుగులేని హవా సాగిస్తోంది. అయితే ఇన్నేళ్లుగా కాజల్ అందం పెరుగుతోందే కానీ తరగడం లేదన్న ప్రశంస ఉంది. అయితే అందాన్ని కాపాడుకునేందుకు కాజల్ పడుతున్న పాట్లు గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఒకానొక సందర్భంలో ఇన్నేళ్లయినా ఇంకా ఆ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు? అని ప్రశ్నిస్తే అందుకు షాకిచ్చే జవాబు చెప్పింది ఈ బ్యూటీ. తన ఆరోగ్యం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువేనని .. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని చెప్పి షాకిచ్చింది. వాటి నుంచి బయటపడేందుకు తాను నిరంతరం ఫిట్ నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించింది.

అందుకోసం యోగా- ధ్యానం- జిమ్ అంటూ చాలానే శ్రమిస్తుందట. ఇలాంటి క్రమశిక్షణ తోనే ఫిట్ గా ఉండగలనని వెల్లడించింది. పన్నెండేళ్లుగా ఈ శ్రమ ఇలానే కొనసాగిస్తోందట. తాజాగా కాజల్ జిమ్మింగ్ చేస్తున్న ఫోటో.. వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ ఫోటోలో జిమ్ లో పర్సనల్ ట్రైనర్ శ్రీరామ్ సమక్షంలో దాదాపు 70 కేజీల బరువైన బరువులను భుజాలపై ఎత్తుతోంది. కాజల్ జిమ్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తన హార్డ్ వర్క్ గురించి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

పరిశ్రమలో అగ్ర కథానాయకులందరితో పని చేసిన కాజల్ నవతరం హీరోల సరసనా నటించగలుగుతున్నారంటే దానికి కారణమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే కమల్ హాసన్ సరసన `భారతీయుడు 2`లో నటించేందుకు ఫిట్నెస్ పరంగా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారని.. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారని ప్రచారమైంది. అయితే ఆ సినిమా అంతకంతకు ఆలస్యం అవ్వడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం చర్చెకు వచ్చింది. ప్రస్తుతం కాజల్ నటించిన రణరంగం.. కోమలి చిత్రాలు ఆగష్టు 15 న రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూవీతో పాటు కాజల్ హాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీలో కనిపంచాలంటే చాలా ఫిట్ గా కనిపించాలి. అందుకోసం ఇలా హార్డ్ వర్క్ చేస్తున్నానని కాజల్ తెలిపారు. హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ సాగుతోందట.

వీడియో కోసం క్లిక్ చేయండి 
Please Read Disclaimer