పెళ్లి పీటలు ఎక్కబోతున్న చందమామ…?

0

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి చేసుకోగా దగ్గుబాటి రానా మరియు నితిన్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది అనే వార్త తెగ వైరల్ అవుతోంది. ఔరంగాబాద్ కి చెందిన ఓ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతోందని.. వచ్చే ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై చందమామ కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.కాగా గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ముందుకు సాగుతోంది. ఆమె చెల్లెలు హీరోయిన్ నిషా అగర్వాల్ ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ కాజల్ మాత్రం తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టింది. ఇటీవలే 35వ ఏట అడుగుపెట్టిన కాజల్ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా తల్లి దండ్రులు తనను పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తున్నారని.. నన్ను బాగా చూసుకునేవాడు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి తనకు భర్తగా కావాలని వెల్లడించింది.

ఇదిలా ఉండగా కాజల్ ప్రస్తుతం చేతిలో అరడజనుకి పైగా ఆఫర్స్ ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’.. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’.. ‘హే సినామికా’లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘ముంబయి సాగా’ సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ లోనూ కనిపించనుందని సమాచారం.
Please Read Disclaimer