చరణ్ ను చంపేసి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందట!

0

ఈమద్య కాలంలో మంచు లక్ష్మీ టాక్ షో గురించి మీడియాలో ప్రముఖంగా వింటూ ఉన్నాం. ఆమె సెలబ్రెటీల నుండి బోల్డ్ సమాధానాలను రాబడుతూ వారి సీక్రెట్ లను కెమెరా ముందు ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ను తన షో లో ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను కాజల్ నుండి మంచు లక్ష్మి రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.

నా కెరీర్ లో ఇష్టమైన హీరో రానా. ఆయనతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతాను. రానాతో పని చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది అలాగే చాలా కష్టంగా కూడా ఉంటుంది. అయితే రానా నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకే ఆయన ఇష్టమైన హీరో అంది. నేను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా నాతో పాటు ఒక చిన్న దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నాతో ఉంటే ఇంట్లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

మీకు అవకాశం ఇస్తే ఎవరిని చంపేస్తారు.. ఎవరితో లేచి పోతారు.. ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటూ కాజల్ ను మంచు లక్ష్మి ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం చెప్పింది. రామ్ చరణ్ ను చంపేసి.. ఎన్టీఆర్ తో లేచి పోయి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను అంది. ప్రభాస్ నే ఎందుకు పెళ్లి చేసుకుంటావంటే వారిద్దరికి పెళ్లి అయ్యింది. ప్రభాస్ కు మాత్రమే పెళ్లి కాలేదు కనుక ఆయన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను అంటూ డిప్లమాటిక్ ఆన్సర్ చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది.
Please Read Disclaimer