సినిమాల్లేకపోతే అంతేగా!

0

అందాల చందమామ కాజల్ వైఖరిలో ఇటీవల ఊహించని మార్పు కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే కాజల్ మరీ అంత బిజీ లైఫ్ ని ఇష్టపడడం లేదు. అందుకే ఎడా పెడా ఏవి పడితే అవి అంగీకరించడం లేదట. ఆచితూచి తనని మెప్పించే స్క్రిప్టు వస్తేనే అంగీకరిస్తోందిట.

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 లో నటిస్తోంది. కమల్ హాసన్ – శంకర్ లాంటి దిగ్గజాల కలయికలో సినిమా కాబట్టి దానిపై పూర్తిగానే శ్రద్ధ పెట్టింది. ఇక దాంతో పాటే మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఓ బహుభాషా చిత్రంలోనూ నటిస్తోంది. ఇది కాక రిలీజ్ పెండింగులో పడిపోయిన పారిస్ పారిస్ ని రిలీజ్ చేయించే పనిలోనూ ఉందిట. అయితే వీటికి సంబంధించిన షూటింగులు జరుగుతున్నా కాజల్ రోల్ కి సంబంధించిన షెడ్యూల్ ఏదీ లేనట్టుంది.

అందుకే ఇలా గ్యాప్ దొరికితే చాలు అలా గర్ల్స్ గ్యాంగ్ తో కలిసి షికార్లు చేసి వస్తోంది. ఇంతకుముందు సిస్టర్ ఫ్యామిలీతో కలిసి ఒంటరి దీవుల విహారానికి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈసారి ఇతరులతో కలిసి ఓ ఎగ్జోటిక్ వెకేషన్ ని ఇదిగో ఇలా ప్లాన్ చేసింది. స్పాట్ నుంచి కాజల్ అదిరిపోయే ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. జీవితం ఉన్నది ఎప్పుడూ బిజీగా ఉండేందుకేనా.. ఇలాంటి చిలౌట్ అవసరం లేదా? అన్నట్టుగానే ఉందీ వ్యవహారం. ఇక కాజల్ వైఖరి అర్థమైపోయిందో ఏమో తనని కదిలించేందుకు కూడా మన స్టార్ హీరోలు ఇష్టపడుతున్నట్టు లేదు. అందుకే ఇప్పుడున్న అరడజను టాప్ స్టార్లు ఎవరూ ఈ అమ్మడికి అవకాశం ఇవ్వడం లేదు. తాజా వెకేషన్ ఫోటోలు చూసిన యూత్.. సినిమాల్లేకపోతే అంతేగా.. అంటూ కాజల్ పై కామెంట్లను గుప్పిస్తున్నారు.
Please Read Disclaimer