ఓ వైపు సామాజిక సేవ.. మరోవైపు రమ్మీ సేవ

0

అందాల చందమామ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. అగ్రహీరోలతో ఆఫర్లను కాదనుకుని కొత్త కుర్రాళ్లకు ఓకే చెబుతుంది. తనకు కంఫర్ట్.. ఎగ్జిస్టెన్సీ ఉంటేనే నటిస్తోంది. పైగా స్క్రిప్టు నచ్చకపోయినా.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా ఎంత పెద్ద స్టార్ కి అయినా ఓకే చెప్పడం లేదు. సౌత్ లో తెలుగు-తమిళం రెండు చోట్లా డబుల్ గేమ్ ఆడుతోంది. ముఖ్యంగా తమిళంలో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.

అదంతా కెరీర్ కి సంబంధించిన కోణం అనుకుంటే.. మరోవైపు సామాజిక సేవలోనూ కాజల్ బిజీ. ఏపీ-అరకు వ్యాలీలో గిరిజన చిన్నారులకు స్కూల్ చదువులు చెప్పిస్తూ సామాజిక సేవ చేస్తోంది. అందుకోసం ఆర్థిక వనరుల్ని సమకూరుస్తోంది. ప్రకృతి అందాల నెలవు అయిన ఆంధ్రా ఊటీ అరకు అంటే తనకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అక్కడికి వెళ్లి గిరిజన సంస్కృతిని అధ్యయనం చేసిన కాజల్ బలహీన వర్గాల పిల్లలందరి కోసం ఓ స్కూల్ నే కట్టించింది. మరోవైపు ఆడ పిల్లల్లో పేదవారికి అవసరం మేర ఆర్థిక సాయం చేయడం తనకు అలవాటు. ఇదే కాదు.. చందమామలో మరో కోణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాజల్ తాజాగా ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది పూర్తి వివాదాస్పదమైనది. ఆన్ లైన్ రమ్మీ కి వరల్డ్ వైడ్ ప్రచారం చేయనుంది. ఇండియా లెవల్లో పాపులారిటీ ఉన్న ఖేల్ ప్లే రమ్మికి కాజల్ బ్రాండ్ అంబాసిడర్ గా భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమంటే .. రమ్మీ ఆటను కాజల్ బాగా ఆస్వాధిస్తుందట. అందుకే ఇప్పుడు ఈ గేమ్ లో నేను భాగం కావడం సంతోషంగా ఉందని స్టేట్ మెంట్ ఇచ్చింది. “ఖేల్ ప్లే రమ్మీ గేమ్ ఆన్ లైన్ లో మంచి స్థానంలో ఉంది. రమ్మిని వరల్డ్ వైడ్ విస్తరించడం ఈ సంస్థ లక్ష్యం. ఇండియాలో నెంబర్ స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో రమ్మికి మరింత ఆదరణ దక్కుతుంది“ అంటూ బోలెడంత ప్రచారం చేసేస్తోంది.

అయితే ఇలా రమ్మీకి ప్రచారం చేసిన స్టార్లందరికీ బోలెడన్ని చీవాట్లు తప్పలేదు. ఎమీజాక్సన్.. రానా.. ప్రకాష్ రాజ్ రమ్మీకి ప్రచారం చేసి నెటిజనంతో తిట్లు తిన్నారు. ఎమీ జాక్సన్ ఇప్పటికీ బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు కాజల్ ఖాతాలోకి రమ్మీ వచ్చి చేరింది. ఓవైపు సామాజిక సేవ.. ఇంకో వైపు రమ్మీ సేవ ఏమిటో కాజల్ డబుల్ గేమ్? జేబు గుల్ల చేసే వాటికి ప్రచారం .. సరైనదేనా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఈ అమ్మడికి సంబంధించిన ప్రకటన ఎయిర్ లోకి వచ్చాక డిబేట్ ఇంకా పెరుగుతుందేమో!!
Please Read Disclaimer