చందమామకు పోటీనే లేదు

0

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయినా ఇప్పటికీ సేమ్ గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ న్యూ జెనరేషన్ హీరోయిన్లకుపోటీ ఇస్తోంది. కాజల్ ఫేడ్ అవుట్ అయిందని విమర్శకులు వ్యాఖ్యలు చేయడం.. అంతలో ఒకటో రెండో క్రేజీ ప్రాజెక్టులను తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం కాజల్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక సోషల్ మీడియాలోన్యూ జనరేషన్ వారికి పోటీ ఇవ్వడంలో కూడా వెనకడుగు వెయ్యదు. అందుకే ఇన్స్టాలో దాదాపు 13 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

ఎప్పటికప్పుడు కొత్తగా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకు ఆ హాటు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు మాత్రమే కాదు.. కాజల్ ఎక్కడ కనిపించినా కెమెరాలు క్లిక్కుమంటాయి. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. రీసెంట్ గా అలానే కాజల్ ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఫోటోలు మాత్రం కాజల్ స్వయంగా తీసుకున్న సెల్ఫీలు. లవ్ సింబల్ ఉండే బేబీ పింక్ కలర్ శారీ.. రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి సూపర్ గా రెడీ అయింది. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ తో స్టైలింగ్ కంప్లీట్ చేస్తింది. కాస్త తడిగా ఉన్న జుట్టు.. నుదుటిన బొట్టు చూస్తుంటే దీపావళి పండుగ లుక్ లా అనిపిస్తోంది. ఏదైతేనేం.. కాజల్ ఈ డ్రెస్ లో మరోసారి టాలీవుడ్ చందమామ అనిపించింది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’.. ‘ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘ముంబై సాగా’ అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటుగా ‘కాల్ సెంటర్’ అనే తెలుగు-ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది.