కాజల్ కు కెరీర్ పై క్లారిటీ వచ్చేసింది?

0

టాలీవుడ్.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఈమద్య కాస్త ఫేడ్ ఔట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా కూడా ఈ అమ్మడి కెరీర్ గురించి ఒక క్లారిటీ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె పెళ్లి గురించి కలలు కనడం మొదలు పెట్టింది. కాజల్ చెల్లెలు చాలా రోజుల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలతో ఎంజాయ్ కూడా చేస్తుంది. కాని కాజల్ మాత్రం హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి వద్దనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తూ వస్తుంది.

తాజాగా ఒక టాక్ షో లో పాల్గొన్న కాజల్ పెళ్లి గురించి మాట్లాడింది. త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనల్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. కెరీర్ తుది దశకు చేరుకున్న కారణంగానే కాజల్ కు పెళ్లిపై మనసు పడిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చేది లేనిది చెప్పలేమని అందుకే కాజల్ ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుందేమో అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అదే టాక్ షో లో తనకు కావాల్సిన భర్త లక్షణాలను కూడా చెప్పింది. నన్ను బాగా చూసుకోవడంతో పాటు.. దైవ భక్తి కూడా ఉండాలని చెప్పింది. నాకు బాగా దైవ భక్తి ఉంది. అందుకే నా భర్తకు కూడా దైవ భక్తి ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉంటేనే బాగుంటుంది అంది. ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. కాని కొన్నాళ్ల తర్వాత అవి పుకార్లే అని తేలిపోయింది. ప్రస్తుతం తమిళంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న కాజల్ తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయి.
Please Read Disclaimer