టుస్సాడ్స్ వైరస్ సోకిన తొలి సౌత్ బ్యూటీ

0

ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు గజగజ ఒణికిపోతోంది. చైనా సహా అన్ని దేశాల్లో పరిస్థితి అల్ల కల్లోలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇదో కొత్త వైరసా? ఏమిటి టుస్సాడ్స్ వైరస్ అంటే? ఇంతకీ ఎవరికి సోకింది? అంటే… కాస్త వివరాల్లోకి వెళ్లాలి.

సౌతిండియా టాప్ హీరోయిన్ గా దశాబ్ధం పాటు కెరీర్ ని సాగించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఎగ్జయిటింగ్ క్షణాల్ని ఆస్వాధిస్తోంది. మరో 12 గంటల్లో ఈ భామ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ ముహూర్తం నిర్ణయించడమే దీనికి కారణం. ఫిబ్రవరి 5 దివ్యమైన ముహూర్తాన్ని పురష్కరించుకుని .. కాజల్ అంతకంతకు టెన్షన్ తో నలిగిపోతోందట. దీంతో ఈ అమ్మడికి నిజంగానే టుస్సాడ్స్ వైరస్ పట్టుకుందేమో అన్న అనుమానం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది.

ఒకవేళ ఇదే నిజమైతే.. ప్రభాస్ – మహేష్ లాంటి అగ్ర హీరోల తర్వాత ఆ అవకాశం దక్కించుకున్న సౌత్ హీరోయిన్ కాజల్ నే అవుతుంది. అందుకే ఈ క్షణం కోసం కాజల్ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోందట. ఆ విషయం చెబుతూ ఓ వీడియోని ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాల్లో క్షణాల్లో వైరల్ అయిపోతోంది. మొత్తానికి టుస్సాడ్స్ లో విగ్రహాన్ని సెలబ్రిటీలు ఎంత క్రేజీగా భావిస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్న కాజల్ కి ఈ అరుదైన గౌరవం దక్కడం సినిమాకి ప్రచారం పరంగా ప్లస్ అవుతుందనే భావించాలి. మ్యాడమ్ టుస్సాడ్స్ లో ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్- హృతిక్ రోషన్- షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ లకు విగ్రహాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో క్వాలిటీస్ ఉంటే కానీ ఇలాంటి అరుదైన అవకాశం దక్కదు. ఆ అవకాశం దక్కిన ఆనందంలోనే కాజల్ అంతగా ఎగ్జయిట్ అవుతోందన్నమాట.
Please Read Disclaimer