అ! సీక్వెల్ లో ఓబయ్య సీతలు ?

0

ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అ! కు వచ్చిన గుర్తింపు తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ కు పురస్కారం దక్కనప్పటికీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు మేకప్ క్యాటగిరీలో కూడా అ! జెండా ఎగరేసింది. ఇతని రెండో సినిమా కల్కి ఆశించిన విజయం సాధించనప్పటికి టెక్నికల్ గా ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మూడో ప్రయత్నంలో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. అది కూడా అ! సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్టు తెలిసింది.

కాని ఫస్ట్ పార్ట్ తరహాలో ఇందులో భిన్నమైన ఐదారు కథలు ఉండవట. కేవలం ఒక కథతోనే స్క్రీన్ ప్లే సాగుతుందని కాకపోతే ఇంతవరకు ఎవరూ చేయని ప్రయోగం తరహాలో దీన్ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్టు ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. ఓ ఇంగ్లీష్ డైలీతో చెప్పిన సమాచారం మేరకు ఇందులో కీలక పాత్ర కోసం మరోసారి కాజల్ అగర్వాల్ కోసం ట్రై చేస్తున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్

అ!లో చేసింది ఎలాగూ కాజలే కాబట్టి ఇందులో కూడా తనే ఉండాలని కోరుకుంటున్నాడు. మరో హీరో తరహా రోల్ కోసం విజయ్ సేతుపతి కోసం ట్రయ్ చేస్తున్నట్టు తెలిపాడు. నిజానికి అతను తమిళ్ కాకుండా ఇతర బాషా దర్శకులకు దొరకడం చాలా కష్టంగా ఉంది. సైరాలో ఓబయ్యగా కీలకమైన పాత్ర చేసిన విజయ్ సేతుపతి ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ఉప్పెనకు ఓకే చెప్పాడు కానీ కాల్ షీట్స్ సమస్య వల్ల అదీ ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికే ఫిలిం నగర్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మకు విజయ్ సేతుపతి దొరకడం పెద్ద ఛాలెంజే. కాజల్ కథ మెచ్చుకుంది కానీ ఇంకా సైన్ చేసే విషయంగా కన్ఫర్మేషన్ ఇవ్వలేదట. సో మొత్తానికి ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే అ!ను మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చూడొచ్చన్న మాట
Please Read Disclaimer